Saturday, 3 April 2021

‘వకీల్‌సాబ్’ చిత్ర యూనిట్‌కి షాక్.. హీరోయిన్‌కి కరోనా పాజిటివ్..

భారతదేశంలో కరోనా వైరస్ రెండో దశలో అతి తీవ్రంగా వ్యాపిస్తుంది. గత ఏడాది మార్చిలో లాక్‌డౌన్ విధించి కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ, ప్రజలు ఎదురుకుంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తూ వచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి మరింత విస్తృతం అయింది. లాక్‌డౌన్‌ని పూర్తిగా తొలగించడంతో.. సినిమాల షూటింగ్‌లు శరవేగంగా పూర్తి చేసుకొని.. ఇప్పుటికే పలు సినిమాలు థియేటర్లలో విడుదలై సూపర్ హిట్లుగా నిలిచాయి. మరోవైపు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా షూటింగ్‌లలో పాల్గొనడం వల్ల ఇప్పటికే పలువురు నటీ నటులు కరోనా బారీన పడ్డారు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, నటి ఆలియా భట్, నటుడు మాధవన్ తదితరులు కరోనా సోకి క్వారంటైన్‌లో ఉన్నారు. ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి ప్రభావం పవర్‌స్టార్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రంపై పడింది. చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ నివేధా థామస్‌కి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ జరిగింది. ఈ విషయాన్ని నివేదా సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. ‘‘నాకు కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో నేను స్వయంగా ఐసోలేషన్‌లో ఉంటూ.. త్వరగా కోలుకొనేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఈ సమయంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ.. ముఖ్యంగా నా మెడికల్ టీంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. జాగ్రత్తగా ఉండండి.. మాస్క్ ధరించండి’’ అంటూ నివేధా ట్వీట్ చేసింది. ‘’ ప్రమోషన్ల ఉత్సాహంగా పాల్గొంటున్న నివేదాకి కరోనా సోకడంతో చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది. గత కొన్ని రోజులుగా ఆమెని కలిసిన వాళ్లు కరోనా పరీక్షలు చేయించుకొనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘అజ్ఞాతవాసీ’ తర్వాత సినిమాలకు దూరమై.. రాజకీయాలపై దృష్టిసారించిన పవన్ కళ్యాణ్.. ‘వకీల్‌సాబ్’ సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడు. హిందీలో సూపర్‌హిట్ సాధించిన ‘పింక్’ సినిమా రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నివేదాతో పాటు.. అంజలి, అనన్య ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. బోణీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fEOSr0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...