Saturday, 3 April 2021

తప్పొప్పులు కాదు అదొక్కటే శాశ్వతం.. ఆసక్తిరేపుతున్న రమ్యకృష్ణ ఫస్ట్‌లుక్ పోస్టర్

‘బాహుబలి’ వంటి భారీ చిత్రంతో తన కెరీర్‌లో రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించింది నటి రమ్యకృష్ణ. ఈ సినిమాలో శివగామిగా నటనకి తెలుగు ప్రేక్షకులే కాదు.. యావత్ భారతదేశ సినీ అభిమానులు ఫిదా అయ్యారు అనడంలో అతిశయోక్తి లేదు. బాహుబలి తర్వాత ఆ రేంజ్‌ పాత్రలు చేసే అవకాశం రమ్యకృష్ణకు రాలేదు. దీంతో తన తదుపరి పాత్రల ఎంపిక విషయంలో రమ్యకృష్ణ తగినంత జాగ్రత్త తీసుకుంటోంది. ఏదో తెరపై కనిపించామనే పాత్రలు కాకుండా.. ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటించేందుకు ఆమె సుముఖత చూపుతున్నట్లు సమాచారం. ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం తర్వాత యంగ్ హీరో నటిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్’. దేవా కట్ట దర్శకత్వంలో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించింది. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి రమ్యకృష్ణ ఫస్ట్‌లుక్‌ని ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ పోస్టర్‌ని షేర్ చేసిన హీరో సాయి ధరమ్ తేజ్ ‘‘లెజండరీ రమ్యకృష్ణతో కలిసి నటించడం నాకు ఎంతో గర్వంగా ఉంది. విశాఖ వాణి పాత్రలో ఆమెను తెరపై ఎప్పుడు చూస్తానా అని ఎదురుచూస్తున్నాను’’ అంటూ పేర్కొన్నాడు. ‘తప్పు, ఒప్పులు లేవు.. అధికారం ఒకటే శాశ్వతం’ అంటూ ఈ ఫస్ట్‌లుక్‌పై క్యాప్షన్ పెట్టారు. పూర్తిస్థాయి పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, జీ స్టూడియోస్‌ పతాకాలపై భగవాన్, జె.పుల్లారావు భారీ రేంజ్‌లో నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతిబాబు, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rK4ITn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...