Saturday, 3 April 2021

‘మేజర్’ అప్‌డేట్ : ఈ ఉత్తరం ఎంతో ప్రత్యేకమైంది.. లవ్ లెటర్ బయటపెట్టిన అడివి శేష్

విభిన్నమైన కథాకథనంతో చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులను అలరించడంలో హీరో ఎప్పుడు ముందుంటాడు. ఇప్పటికే క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్నాడు శేష్. అతని సినిమా విడుదల అవుతుందంటే అందులో కచ్చితంగా ఏదో ఒక ఆసక్తికర అంశం ఉంటుందనే నమ్మకాన్ని ఇప్పటికే ప్రేక్షకుల్లో క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకూ టాలీవుడ్‌కే పరిమితమైన శేష్.. ఇప్పుడు ‘మేజర్’ అనే సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ డమ్ సంపాదించుకొనే ప్రయత్నంలో ఉన్నాడు. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ‘మేజర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గూఢచారి ఫేమ్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మేజర్ సినిమాను సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో శోభితా ధూళిపాళతో పాటు బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా సోషల్‌మీడియా వేదికగా శేష్ సైయీ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశాడు. ఈ పోస్టర్‌లో హీరోహీరోయిన్‌తో పాటు.. ఓ ప్రేమ లేఖ కూడా ఉంది. ‘‘ఈ ఉత్తరం ఎంతో ప్రత్యేకం. ప్రతి పదం చాలా సింపుల్‌గానే ఉన్నాయి.. కానీ వాటికి ఎంతో విలువ ఉంది. ఆమె అతన్ని స్కూల్‌‌లో కలిసింది. అతనితో జీవితాన్ని ఊహించుకుంది. సైయీ మంజ్రేకర్ ఫస్ట్‌లుక్’’ అంటూ శేష్ ట్వీట్ చేశాడు. అంతేకాక.. మేజర్ టీజర్‌ని ఈ నెల 12వ తేదీన విడుదల చేస్తున్నట్లు వెల్లడించాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uow6br
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...