Monday, 5 April 2021

ప్రియుడి కౌగిలిలో నయనతార.. రొమాంటిక్ మూడ్‌లో ఆ ఇద్దరూ! స్పెషల్ డే అంటూ బయటపెట్టిన హీరోయిన్

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతారకు డేటింగ్‌ చేయడంలో మంచి అనుభవమే ఉంది. ఇది మనం చెప్పుకోవడం కాదండోయ్! గతంలో ఆమె నడిపిన లవ్ అఫైర్స్ చెప్తాయి. మొదట శింబుతో ప్రేమాయణం నడిపిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ప్రభుదేవాను ప్రేమించింది. చివరకు వారిద్దరితో కట్ చేసుకొని ప్రస్తుతం యాక్టర్ కమ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం నడుపుతోంది. అంతేకాదు తాను ప్రేమలో ఉన్నానని చెప్పడానికి ఏ మాత్రం మొహమాట పడకుండా సోషల్ మీడియాలో బాయ్ ఫ్రెండ్‌తో షికార్లు కొట్టే ఫొటోస్ పంచుకోవడం అమ్మడి స్టైల్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె చేసిన ఓ పిక్ వైరల్‌గా మారింది. మోస్ట్ ఎలిజబుల్ లేడీ బ్యాచిలర్‌గా కొనసాగుతున్న గత కొన్నేళ్లుగా విఘ్నేష్ శివన్‌తో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో రొమాంటిక్ ట్రిప్స్ వేశారు. పెళ్లికి ముందే భార్యభర్తల కంటే ఎక్కువ అన్యూన్యంగా ఉంటూ హల్చల్ చేశారు. అయితే నయన్‌కి ఇదే ఫైనల్ లవ్ జర్నీ అని, ఇక అమ్మడు పెళ్లి పీటలెక్కేస్తోందని జోరుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటీవలే తన ప్రియుడు విఘ్నేష్‌ శివన్ గుండెల మీద చేయి వేసి దిగిన ఓ పిక్ షేర్ చేస్తూ చేతికి ఉన్న రింగ్ ఫోకస్ చేసింది ఈ అందాలతార. దీంతో వీరి ఎంగేజ్‌మెంట్ అయిందని, త్వరలోనే బాజాబజంత్రీ అని ఫిక్సయ్యారంతా. ఈ నేపథ్యంలో తాజాగా ప్రియుడి కౌగిలిలో మునిగి రొమాంటిక్ మూడ్‌లో ఉన్న మరో పిక్ చేసింది నయనతార. ఇందులో ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ నిజమైన ప్రేమ పక్షుల్లా కనిపించారు. ఈస్టర్ పండుగ సందర్భంగా ఈ లవ్ బర్డ్స్ ఇలా ప్రేమలో మునిపోయారు. స్వయంగా నయన్.. ఈ పిక్‌ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో వెంటనే వైరల్ అయింది. ఇక నెటిజన్స్ ఊరుకుంటారా? తమదైన స్టైల్ కామెంట్స్ వదులుతూ ఆ ఫోటోపై లైకుల వర్షం కురిపిస్తున్నారు. ‌


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QZ0uum
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...