Monday, 5 April 2021

ఆడవాళ్ళు మీకు జోహార్లు: హోమ్లీ లుక్‌తో ఆకర్షించిన రష్మిక మందన

ప్రస్తుతం క్రేజీ బ్యూటీ ట్రెండ్ నడుస్తోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది రష్మిక. ఈ మేరకు వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. తమిళంలో 'సుల్తాన్' సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె హిందీలో 'గుడ్ బై' మూవీ చేస్తోంది. దీంతోపాటు తెలుగులో ''పుష్ప, ఆడవాళ్ళు మీకు జోహార్లు'' సినిమాలతో బిజీగా ఉంది. అయితే నేడు (ఏప్రిల్ 5) రష్మిక పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. యంగ్ హీరో శర్వానంద్‌ హీరోగా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందుతోన్న '' సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్‌లో చీరకట్టి హోమ్లీ లుక్‌తో ఆకర్షిస్తోంది రష్మిక. పసుపు రంగు చీరలో పువ్వులను కడుతున్నట్లు ఉన్న లుక్‌లో రష్మిక చూపరులను ఇట్టే ఆకట్టుకుంటోంది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ సరసన 'పుష్ప' సినిమాలో నటిస్తోంది రష్మిక. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక పల్లెటూరు అమ్మాయిగా కనిపించనుందని, చిత్రంలో ఆమె రోల్ చాలా కీలకం అని టాక్. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో మాస్ లుక్‌లో కనిపించనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PrPful
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...