Thursday, 1 April 2021

మరో ‘ఉప్పెన’కు వైష్ణవ్ తేజ్ రెడీ.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్‌లో ఉత్సాహం

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం.. టాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసి ఉప్పెన లాంటి కలెక్షన్లు రాబట్టింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టగా.. హీరోయిన్ కృతి శెట్టి అందం, అభినయం చూపుతిప్పుకోకుండా చేసింది. అయితే ఈ సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని చాలా మంది థియేటర్స్‌లో చూశారు. అయితే మరికొంతమంది కరోనా నేపథ్యంలో థియేటర్స్‌కి వెళ్లలేక ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 14న ఉప్పెన చిత్రం స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్ డేట్‌ని అనౌన్స్ చేసింది. కాగా ఓటీటీ రిలీజ్‌కి నెట్‌ఫ్లిక్స్ రూ.7 కోట్లు చెల్లించి డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం ఓటీటీలో ఉప్పెన లాంటి వ్యూస్ రాబట్టి కోట్లు కొల్లగొట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dtw5Me
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...