Thursday, 1 April 2021

అందరి ముందే ఆయనకు కిస్ ఇచ్చిన శ్రీముఖి.. స్టేజ్ మీదే అలా!! బిత్తరపోయిన సీనియర్ సింగర్

ఈ మధ్య సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. బుల్లితెరపై స్పెషల్ ఈవెంట్లలో శ్రీముఖి తన ఉనికిని ప్రదర్శిస్తున్నాడు. మొన్నటి మొన్న శ్రీదేవీ డ్రామా కంపెనీ, అంతకు ముందు బిగ్ బాస్ ఉత్సవం వంటి ఈవెంట్లలో శ్రీముఖి హల్చల్ చేశారు. కానీ శ్రీముఖి చేతిలో తనకంటూ ఓ షో లేకపోయింది. ఒకప్పుడు పటాస్ మధ్యలో స్టార్ట్ మ్యూజిక్ అనే షోలతో శ్రీముఖి ఫుల్ బిజీగా ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు శ్రీముఖిని కేవలం స్పెషల్ ఈవెంట్లకు మాత్రమే పిలుస్తున్నట్టున్నారు. తాజాగా శ్రీముఖి అనే ఈవెంట్‌లో సందడి చేయబోతోన్నారు. ప్రతీ పండుగకు ఓ స్పెషల్ ఈవెంట్ చేయడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. పండుగలు వస్తున్నాయంటే చాలు.. బుల్లితెరపై ఈవెంట్లతో నానా హంగామా చేస్తుంటారు. ఈటీవీ, జీ, స్టార్ మా వంటి చానెళ్లు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తుంటాయి. అలా ఈ ఉగాదికి ఈటీవీలో ఉగాది జాతి రత్నాలు పేరి ఓ ఈవెంట్‌ను చేస్తున్నారు. ఇందులో జబర్దస్త్ కంటెస్టెంట్లు, ఢీ మెంబర్స్ అందరూ కలిసి రచ్చ చేయబోతోన్నట్టు కనిపిస్తోంది. చాలా రోజుల తరువాత సుధీర్, రష్మీ ఒకే ఈవెంట్‌లో కనిపిస్తున్నారు. మామూలుగా అయితే సుధీర్‌ను ఈ స్పెషల్ ఈవెంట్లకు దూరంగా పెడుతూ వచ్చారు. కానీ మొన్న జరిగిన హోలీ ఈవెంట్‌లోనూ సుధీర్ ముందుండి నడిపించారు. ఇప్పుడు ఈ ఉగాది జాతిరత్నాలు ఈవెంట్‌ను కూడా సుధీర్ ముందుండి నడిపించబోతోన్నారు. ఇందులో స్పెషల్ అట్రాక్షన్‌గా నాని రాబోతోన్నారు. నానితో పాటు ఉదయభాను వంటి సీనియర్ యాంకర్లు కూడా ఈ ఈవెంట్‌లో కనిపించబోతోన్నారు. అయితే నాని తన 'టక్ జగదీష్' సినిమా ప్రమోషన్స్‌లో రాబోతోన్నాడని అర్థమవుతోంది. తాజాగా వదిలిన ఉగాది జాతిరత్నాలు ప్రోమోలో ఓ విషయం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. శ్రీముఖి సింగర్ మనోకు ముద్దు పట్టేశారు. శ్రీముఖితో పాటు మరో వ్యక్తి కూడా ముద్దు పెట్టేశారు. అలా ఇద్దరూ ఒకేసారి ముద్దు పెట్టడంతో మనో దెబ్బకు షాక్ అయిపోయారు. మొత్తానికి బుల్లితెరపై ముద్దులు, హగ్గులు కామన్ అయిపోతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dtwApR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...