Friday, 9 April 2021

రాత్రి సమయంలో త్వరగా కానిచ్చేయాలి.. అప్పుడే ఆరోగ్యం!! అమ్మ బాబోయ్ సీక్రెట్స్ బయటపెట్టిన అనసూయ

బుల్లితెర యాంకర్, వెండితెర రంగమ్మత్తగా అనసూయకు విపరీతమైన పాపులారిటీ ఉంది. గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెరపై చిందులు తొక్కినా, వెండితెరపై అద్భుతమైన నటనను కనబర్చినా అది అనసూయకు మాత్రమే దక్కుతుంది. అలాంటి అనసూయకు సోషల్ మీడియాలో మాత్రం ఎక్కువగా నెగెటివిటీ ఎదురవుతూ ఉంటుంది. తనపై జరిగే ట్రోలింగ్‌ను సైతం అనసూయ అంతే స్థాయిలో తిప్పి కొడుతుంటారు. అయితే తాజాగా అనసూయ తన అభిమానులతో ముచ్చట్లు పెట్టారు. ఇందులో అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కొందరు కొంటె ప్రశ్నలు సంధించారు. ఇంకొందరు ఆమె సీక్రెట్స్‌ను అడిగారు. అలా తలా ఒక రకంగా అడిగిన ప్రశ్నలకు అంతే స్థాయిలో అనసూయ బదులిచ్చారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తన సీక్రెట్స్ అన్నీ కూడా బయటపెట్టేశారు అనసూయ. మామూలుగా అయితే హెల్త్ సీక్రెట్స్‌ను, తమ అలవాట్ల గురించి ఎవ్వరూ చెప్పరు. కానీ తాజాగా అనసూయ మాత్రం అన్నింటిని పూస గుచ్చినట్టు వివరించారు. మీరు ఏం అనుకోకుంటే.. ఫైవ్ హెల్త్ సీక్రెట్స్, మీ అలవాట్లను చెబుతారా? అని మర్యాద పూర్వకంగా అడిగేశారు. దీనికి అనసూయ సమాధానంగా తన సీక్రెట్స్ మొత్తం చెప్పేశారు. ఉదయాన్నే కచ్చితంగా గోరు వెచ్చని నీళ్లు తాగాలి.. కాసింత వ్యాయామం చేయాలి.. ఆ తరువాత ప్రాణాయామం చేయాలి. ఏదైనా తిన్నా తరువాత కనీసం 30 నిమిషాలు ఏదో ఒక చిన్న పని చేయాలి.. ఖాళీగా కూర్చోకండి.. రాత్రి ఏడు, ఏడున్నర గంటలలోపు కచ్చితంగా భోజనం చేసేయాలి.. ఏదైనా చేసే ముందుకు ఎందుకు చేస్తారో.. ఆలోచించండి.. అప్పుడు ఎలాంటి బాధలు లేకుండా హ్యాపీగా ఉంటారు అని అనసూయ తన సీక్రెట్స్ అన్నీ కూడా బయటకు చెప్పేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39ZkNhQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...