Friday, 9 April 2021

థియేటర్స్‌లో 'వకీల్ సాబ్' హవా.. తొలి రోజే రికార్డ్స్ బ్రేక్! కోవిడ్ టైమ్‌లోనూ దుమ్ముదులిపిన పవర్ స్టార్

పవర్ స్టార్ సినిమా రిలీజ్ అంటే దేశవిదేశాల్లో ఎంతటి హంగామా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అది కూడా మూడేళ్ల విరామం తర్వాత వెండితెరపైకి ఎంటర్ అవుతున్నారంటే ఆ రేంజ్ ఊహించలేం. సరిగ్గా 'వకీల్ సాబ్' మూవీ విషయంలో అదే జరిగింది. నిన్న (ఏప్రిల్ 9) విడుదలైన ఈ సినిమా అన్ని సెంటర్లలోనూ సత్తా చాటింది. అలాగే ఒక రోజు ముందే ఓవర్సీస్‌ తెరపై దర్శనమిచ్చి అక్కడి రికార్డులు తిరగరాశారు . ఇదివరకే ఎన్నారైలు 'పింక్' సినిమా చూసినప్పటికీ 'వకీల్ సాబ్' సినిమాకు భారీ రెస్పాన్స్ ఇచ్చారు. ఓ వైపు కోవిడ్ విజృంభిస్తున్నా వెండితెరపై వకీల్ సాబ్‌ను చూసేందుకు క్యూ కట్టారు. ఓవర్సీస్‌లో మొత్తం 700కు పైగా థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా అక్కడి బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. దీంతో లాక్ డౌన్ అనంతరం ప్రీమియర్స్ ద్వారా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. అంతకుముందు ప్రీమియర్స్ ద్వారా 'జాతిరత్నాలు' మూవీ దాదాపు 130K డాలర్లు రాబట్టి మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. ఆ రికార్డును ఈజీగా చెరిపేశాడు వకీల్ సాబ్. ప్రీమియర్స్ ద్వారా మొత్తంగా 297k డాలర్లు ఈ వకీల్ సాబ్ వసూలు చేశారని ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. అయితే ఇప్పుడు గనక కోవిడ్ ఎఫెక్ట్ లేకపోయి ఉంటే కలెక్షన్స్ మరో రేంజ్‌లో ఉండేవని, వకీల్ సాబ్ ఈజీగా 1 మిలియన్ మార్క్ అందుకునేవాడని అంటున్నారు. వీకెండ్‌లో కలెక్షన్స్ మరింత పుంజుకుంటాయని చెబుతున్నారు. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు డైరెక్టర్ వేణు శ్రీరామ్ టేకింగ్ ప్లస్ అయింది. మాతృక 'పింక్' సినిమాను తెలుగు నేటివికీ దగ్గరగా చూపిస్తూ పవన్ హీరోయిజం ఎలివేట్ చేశారు వేణు. ఈ చిత్రంలో అంజలి, అనన్య, నివేదా నటనకు మంచి మార్కులు పడ్డాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OE2jME
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...