Sunday, 11 April 2021

BB3: డేట్, టైమ్ ఫిక్స్.. అనుకున్నట్లుగా ఉగాది రోజే! ఇక నందమూరి ఫ్యాన్స్ సంబరాలు షురూ..

నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైటిల్ అనౌన్స్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే ఫస్ట్ రోర్ ద్వారా సినిమాపై అంచనాలు పెంచేసిన చిత్రయూనిట్ ఉగాది రోజు సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. BB3 టైటిల్ తోనే ఇప్పటివరకు అప్‌డేట్స్ ఇస్తూ విడుదల తేదీ సైతం ప్రకటించిన టీమ్.. ఉగాది కానుకగా ఈ చిత్ర టైటిల్ వెల్లడించబోతున్నట్లు తెలిపారు. తెలుగు సంవత్సరాది ఉగాది రోజు మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాలకు ఈ సినిమా టైటిల్‌ అనౌన్స్‌ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. టైటిల్ విషయమై ఇప్పటికే చాలా పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మొదట 'మోనార్క్' అనే టైటిల్ ప్రచారంలోకి రాగా, ఆ తర్వాత ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ఫైనల్ చేశారనే టాక్ వినిపించింది. అలాగే ‘టార్చ్ బేరర్’ అనే మరో టైటిల్ పరిశీలనలో పెట్టారని తెలుస్తుండటంతో జనాల్లో ఆసక్తి నెలకొంది. ఈ ఆసక్తికి ఏప్రిల్ 13న తెరదించబోతున్నారు. నందమూరి బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. హీరోయిన్‌ పూర్ణ కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో మరోసారి డ్యూయల్ రోల్ పోషిస్తుండటం విశేషం. అఘోరాగా, అలాగే కలెక్టర్‌గా రెండు బలమైన పాత్రల్లో ఆయన కనిపించబోతున్నారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలో జరుగుతోంది. మే 28న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3s8XvN5
v

No comments:

Post a Comment