Sunday, 11 April 2021

మహేశ్-రాజమౌళి సినిమా అప్పుడే.. ఆ సినిమాతో పాటు ఇది కూడా.. చక్కర్లు కొడుతున్న రూమర్స్..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఓ హీరో-డైరెక్టర్ కాంబినేషన్‌ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంటే.. అది సూపర్‌స్టార్ , దర్శకధీరుడు కాంబినేషనే. ఈ బ్లాక్‌బస్టర్ కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ అభిమానులు కన్న కలలు త్వరలోనే సాకారం అవనున్నాయి. త్వరలో మహేశ్ బాబుతో సినిమా చేస్తానని ఇప్పటికే రాజమౌళి ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన ఆ సినిమా పూర్తైన వెంటనే మహేశ్‌తో సినిమా చేసే అవకాశం ఉంది. అయితే ప్రకటిన వచ్చినప్పటి నుంచి సినిమా గురించి అనేక రూమర్లు పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ సినిమాపై మరో రూమర్ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం మహేశ్‌బాబు ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ‘’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అయితే ఈ సినిమాతో పాటే రాజమౌళి సినిమాను కూడా మహేశ్ ప్రారంభించనున్నాడని రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనే విషయం తెలియదు. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర రూమర్‌ కూడా వైరల్ అవుతోంది. అది ఏంటంటే.. ఈ సినిమాని మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ బయోపిక్‌గా రాబోతుందట. ఈ సినిమాలో మహేశ్ శివాజీ పాత్రలో నటిస్తున్నాడంటూ.. ఇప్పటికే పలు ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే అధికారికంగా ప్రకటన రావాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/321Tj7b
v

No comments:

Post a Comment