Tuesday, 2 March 2021

Vakeel Saab: 'సత్యమేవ జయతే' అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులకు స్పెషల్ ట్రీట్

'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత వెండితెరకు దూరమైన తిరిగి ఇటీవలే కెమెరా ముందుకొచ్చి యమ స్పీడుగా సినిమాలు చేస్తున్నారు. దీంతో మరోసారి పవన్‌ని థియేటర్స్‌లో చూడాలని ఆతృతగా వెయిట్ చేస్తున్నారు మెగా అభిమానులు. ఈ నేపథ్యంలో ఇటీవలే తన రీ- ఎంట్రీ మూవీ 'వకీల్ సాబ్' షూటింగ్ ఫినిష్ చేసిన పవర్ స్టార్.. ఆ సినిమా అప్‌డేట్స్‌తో హుషారెత్తిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్‌, టీజర్‌, మగువ మగువ సాంగ్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా మరో అప్‌డేట్‌తో అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు మేకర్స్. వకీల్ సాబ్ మూవీ నుంచి రెండో సాంగ్ '...' లిరికల్ సాంగ్ మార్చి 3వ తేదీ సాయంత్రం 5 గంటలకు విడుదల విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ లుక్ అట్రాక్ట్ చేస్తోంది. లాయర్ గెటప్‌లో కోటు ధరించి పవన్ కళ్యాణ్ కనిపిస్తుండగా.. ఆయన వెనుక మహాత్మ గాంధీ ఫొటో ఉంది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'పింక్' తెలుగు రీమేక్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్న డైరెక్టర్ వేణు శ్రీరామ్.. పవన్ ఇమేజ్‌, తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా చాలా మార్పులు చేశారట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. శృతి హాసన్ ముఖ్యపాత్ర పోషిస్తోంది. లాయర్ పాత్రలో పవన్ రోల్ అట్రాక్ట్ చేయనుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 9వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3r9jUtS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...