రేపు (మార్చి 27) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా నేటి నుంచే సంబరాలు షురూ చేశారు. ఇప్పటికే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. చెర్రీ కామన్ డీపీ రిలీజ్ చేయగా, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. అబ్బురపరిచే చెర్రీ విజువల్స్‌తో కూడిన ఓ మోషన్ పోస్టర్ బయటకు వదిలారు. మరోవైపు రామ్ చరణ్ ఫాన్స్ స్పెషల్ సాంగ్ రెడీ చేశారు. ఇవన్నీ ఒకెత్తయితే తాజాగా మెగా ప్రాజెక్ట్ నుంచి జక్కన్న ఇచ్చిన సర్‌ప్రైజ్ మరో ఎత్తయింది. మెగా ఫ్యాన్స్ అంతా ఊహించినట్లుగానే లేటెస్ట్ అప్‌డేట్‌తో ఖుషీ చేశారు జక్కన్న. రామరాజుగా రామ్ చరణ్ లుక్ చూపిస్తూ విడుదలకు ముందే గూస్ బంప్స్ తెప్పించారు. అల్లూరి గర్జన ఏరకంగా ఉండబోతోందో జస్ట్ చిన్న శాంపిల్ వదిలి రామ్ చరణ్ రౌద్ర రూపాన్ని పరిచయం చేశారు. పోస్టర్ రిలీజ్ చేసిన జక్కన్న.. ధైర్యానికి చిహ్నం, అందరూ గౌరవించదగిన నిజాయితీ గల రామరాజు అంటూ ట్వీట్ చేశారు. తాజాగా వదిలిన ఈ పోస్టర్‌లో చేతిలో విల్లు పట్టుకొని అల్లూరి సీతారామరాజుగా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించారు రామ్ చరణ్. ఇదే పోస్టర్‌ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఎన్టీఆర్.. నీతి, నిజాయితీ, ధైర్యం అన్నీ ఉన్న నా సోదరుడు రామ్ చరణ్ భయంకరమైన అవతార్ అని పేర్కొన్నారు. రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ ధైర్యానికి, సమగ్రతకి నిర్వచనం అయిన అల్లూరి సీతారామరాజు పోషిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. దీంతో విడుదల చేసిన కొన్ని నిమిషాల్లోనే ఈ పోస్టర్ వైరల్‌గా మారింది. లైకులు, కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు మెగా ఫ్యాన్స్. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్న RRR మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఫిక్షనల్ పీరియాడికల్ మూవీగా 1920 బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రంలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ కనిపించబోతున్నారు. చెర్రీ సరసన ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3srGgHs
v
No comments:
Post a Comment