Friday, 26 March 2021

నేనిలా తయారవ్వడానికి కారణం మీరే.. రష్మిక మందన కామెంట్స్ వైరల్

ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. 'సుల్తాన్' సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెట్టబోతోన్నారు. కార్తీ హీరోగా రాబోతోన్న ఈ చిత్రంతో మొదటిసారిగా తమిళ ప్రేక్షకులను నేరుగా పలకరించబోతోన్నారు. ఈ క్రమంలో నిన్న విడుదల చేసిన సుల్తాన్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. రష్మిక లుక్, నటనకు కూడా అందరూ ఫిదా అవుతున్నారు. మామూలుగా ఈ మధ్య రష్మిక వీడియో ఒకటి నెట్టింట్లో తెగ హల్చల్ చేసింది. పొలంలో దిగి.. నాగలి పట్టి దున్నుతున్న వీడియో ఒకటి నెట్టింట్లో హల్చల్ చేసింది. అది ఈ మూవీకి సంబంధించిన వీడియోనే. సుల్తాన్ సినిమాలో రష్మిక.. పల్లెటూరి అమ్మాయిగా సేద్యం చేసే యువతిగా కనిపించనున్నారు. అయితే అలా సినిమా కోసం నిజంగానే మట్టిలో దిగి, నిజంగానే వ్యవసాయం చేయడంతో రష్మికపై అందరూ ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాలో రష్మిక చేసే అల్లరి చేష్టలు అందరికీ తెలిసిందే. తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో రష్మిక కలిసిందంటే చేసే సందడి అంతా ఇంతా కాదు. వెరైటీ ఫోటో షూట్లు చేయడం, వాటిని అభిమానులతో పంచుకోవడం రష్మికకు సరదా. మామూలుగా అయితే ఈ మధ్య రష్మిక వర్కవుట్లతోనూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. లాక్డౌన్ సమయంలో ఆమె చేసిన వర్కవుట్లు తెగ వైరల్ అయ్యాయి. బీచ్‌లో పరిగెత్తుతూ చేసిన వర్కవుట్ల గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా సుల్తాన్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా చెన్నైకి వచ్చారు రష్మిక. ఈ క్రమంలో ఓ హోటల్‌లో బస చేశారు. అయితే అక్కడి వారు ప్రేమతో ఫుడ్‌ను పెట్టారు. వాటిని చూపిస్తూ రష్మిక ఓ కామెంట్ చేశారు. మీ వల్లే నేను లావుగా తయారవుతున్నాను.. కానీ మీరు ప్రేమతో పెట్టారు కదా? తినేస్తాను అనేలా మాట్లాడేశారు. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప', శర్వానంద్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక హిందీలో సిద్దార్థ్ మల్హోత్రతో కలిసి మిస్టర్ మజ్ను సినిమా చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39hktuI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...