Friday, 26 March 2021

Dr. Rajasekhar మర్మాణువు: యాంగ్రీ స్టార్ డిఫరెంట్ సబ్జెక్ట్.. వెరైటీ టైటిల్‌తో కొత్త సినిమా

నేటితరం కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు టాలీవుడ్ సీనియర్ హీరోలు. ఈ లిస్టుతో ఒకరైన యాంగ్రీ స్టార్ ఇటీవలే ''గరుడ వేగ, కల్కి'' సినిమాలతో హిట్స్ అందుకొని ఇప్పుడు మరో డిఫరెంట్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ చిత్రానికి '' అనే డిఫరెంట్ టైటిల్ ఖరారు చేస్తూ టైటిల్ లుక్ పోస్టర్ వదిలారు మేకర్స్. ''కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'' చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ టైటిల్ పోస్టర్‌లో ఒక పుర్రెకు తలపాగా చుట్టారు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ ఒక్క లుక్‌తో సినిమాపై అంచనాలు పెంచేసిందనే చెప్పుకోవాలి. పోస్టర్, టైటిల్ ద్వారా ఈ స్టోరీ డిఫరెంట్‌గా ఉండనుందని చెప్పేశారు మేకర్స్. ఈ సినిమాను రాజశేఖర్ వేరే నిర్మాతలతో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. వెంకటేష్ మహా అద్భుతమైన కథ చెప్పారని తెలిపిన నిర్మాతలు సినిమాకు మంచి టైటిల్ కుదిరిందని అన్నారు. కథ, కథనాలు అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని, ఈ సినిమాలో రాజశేఖర్ పాత్ర చాలా వైవిధ్యభరితంగా ఉంటుందని చెప్పారు. ఈ మూవీకి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. మొత్తానికైతే ఈ పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని రాజశేఖర్ కొత్త సినిమాపై పెట్టారని చెప్పుకోవచ్చు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PymlrL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...