Monday, 8 March 2021

చెప్పుకోలేని చోట టచ్ చేస్తున్నారు.. కొడాలి నాని తినేది అన్నమా అశుద్దమా? : దివ్యవాణి సంచలన కామెంట్స్

మహిళా దినోత్సవం నాడు అమరావతి మహిళలు వెలగపూడి సచివాలయం దగ్గర చేపట్టిన నిరసన దీక్ష ఉద్రిక్తతలకు దారితీసింది. సచివాలయానికి చేరుకోవడానికి అమరావతి మహిళా రైతులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పలువురు మహిళల్ని అడ్డుకుని స్టేషన్‌కి తరలించారు పోలీసులు. అయితే మహిళా రైతులకు మద్దతు ప్రకటించేందుకు వెళ్లిన తెలుగుదేశం అధికార ప్రతినిధి దివ్యవాణిని సైతం అడ్డుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపైనా.. మంత్రి కొడాలి నానిపైన సంచలన కామెంట్స్ చేశారు . ‘ఇది చాలా దారుణం.. గత 445 రోజులుగా అమరావతి బిడ్డలకు నరకం చూపిస్తున్నారు. అమెరికాలో ఉండే చెత్త వెధవలు కూడా వీళ్లని ప్రాస్టిట్యూట్స్ అని మాట్లాడుతున్నారు. ప్రజా సొమ్ముని వాడుకుంటూ వాళ్లపైనే దాడులు చేస్తున్నారు. మహిళా దినోత్సవం అని చెప్పి .. వాళ్ల దేవుడ్ని కలవడానికి వెళ్లడం కూడా పాపమా?? ఎందుకు వీళ్లని అడ్డుకుంటున్నారు పోలీసులు. హోమ్ మినిస్టర్ ఒక మహిళగా ఉండి కూడా ఎందుకు చలించడం లేదు. ఆడవాళ్లని చెప్పుకోలేని చోట్ల పట్టుకుని హింస పెడుతున్నారు.. మీడియా వాళ్లు కూడా పెయిడ్ ఆర్టిస్ట్‌లు అంటున్నారు.. కుటుంబాలను వదులుకుని కరోనా టైంలో కూడా పోరాడుతుంటే.. వాళ్లపై దాడులు చేస్తారా?? ఆడది అంటే అబల అంటున్నారు.. ఆడది తబల అయ్యి వాయించడం మొదలుపెడితే.. ప్రపంచాలు కదులుతాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారూ.. మీకు రెండు చేతులూ జోడించి చెప్తున్నా.. ఆడవాళ్ల కన్నీటిలో ప్రభుత్వాలు కొట్టుకుపోయే చరిత్ర మీకు వద్దు. ఆడవాళ్లు అమ్మవారి గుడికి వెళ్తుంటే.. డ్రోన్ కెమెరాలు పెట్టారు.. ఇదేమన్నా పాకిస్థాన్ అనుకుంటున్నారా?? న్యాయం కోసం ట్రంప్ దగ్గరకు వెళ్లాలా?? లేక మోడీ దగ్గరకు వెళ్లాలా?? ఈ పోరాటానికి సామాజిక వర్గం అనే ముద్ర వేశారు.. దమ్ముంటే రమ్మని చెప్పండి. అధికారం మీ చేతుల్లోనే ఉంది కదా.. లెక్కలు తీయండి.. ఏ కులం వాళ్లు ఎంత మంది ఉన్నారో తెలుస్తుంది. అనేకమంది ముసలివాళ్లు.. చదువుకున్న యువతులు ఇలా చాలామంది ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. కనీసం మీకు మానవత్వం లేదా?? మేం చావుకి భయపడేది లేదు.. ఎంతమందిని చంపుతారో చంపండి. న్యాయం మా పక్షాన ఉంది. ఈ సందర్భంగా మేం కొడాలి నానిని ప్రశ్నిస్తున్నాం.. ఆయన ప్రెస్ మీట్ పెట్టి నోటికొచ్చినట్టు పేలుతున్నారు. జగన్ మోహన్ రెడ్డిగారికి ఏ1, ఏ2 చంద్రబాబు నాయుడుగారు పెట్టారు. న్యాయం స్థానమే ఏ1, ఏ2 గా ముద్రవేసింది. చంద్రబాబు నాయుడు వ్యభిచార గృహం నడిపారని ముద్రవేస్తున్నారు. ఆయన వ్యభిచార గృహం నడిపితే నువ్ అమ్మాయిల్ని సప్లై చేశావా?? అంటే తల ఎక్కడ పెట్టుకుంటారు. కడుపుకి అన్నం తినే మాటలు మాట్లాడాలి తప్ప.. అశుద్ధం తినే మాటలు మాట్లాడకూడదు’ అంటూ నిప్పులు చెరిగారు దివ్యవాణి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ei2NCz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...