Monday, 15 March 2021

చెర్రీ పండులా జాన్వీ కపూర్.. స్ట్రాప్‌లెస్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తోన్న బ్యూటీ

దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ తన డ్రెస్సింగ్ స్టైల్‌తో అందరి కళ్లను తనవైపు తిప్పుకుంటూ ఉంటారు. ఆమె సింపుల్‌గా చుడీదార్ వేసుకున్నా.. అందాలు ఆరబోస్తూ ట్రెండీ డ్రెస్ వేసుకున్నా వహ్వా అనాల్సిందే. అందుకే, ఫొటో షేరింగ్ ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ప్లాట్‌ఫాం ద్వారానే తన అందమైన ఫొటోలను జాన్వీ కపూర్ అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ అందమైన ఫొటోలకు శ్రీదేవి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. సీజన్‌ను బట్టి ఫొటోషూట్లు చేసే జాన్వీ కపూర్.. ప్రస్తుతం వసంత కాలం సందర్భంగా స్పెషల్ ఫొటోషూట్లు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఒక ఫొటోషూట్ చేసి ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు జాన్వి. ఈ ఫొటోల్లో జాన్వి చెర్రీ పండులా మెరిసిపోతున్నారు. ఈ ఫొటోలకు జాన్వి కూడా ‘వసంత కాలంలో చెర్రీలు’ అని క్యాప్షన్ పెట్టారు. చెర్రీ పండు రంగులో ఉన్న స్ట్రాప్‌లెస్ ఫ్రాక్‌ ధరించిన జాన్వి సెక్సీగా కనిపిస్తున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ కుమార్తె అయిన జాన్వీ.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకునే పనిలో ఉన్నారు. ఆచితూచి అడుగులు వేస్తూ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఆమె ‘రూహి’ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. రాజ్‌కుమార్ రావు, వరుణ్ శర్మలతో కలిసి ఈ చిత్రంలో జాన్వి కపూర్ నటించారు. ఈనెల 11న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం జాన్వి కపూర్ చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. ‘దోస్తాన 2’, ‘గుడ్ లక్ జెర్రీ’ చిత్రాల్లో నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OWEcZr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...