Monday, 15 March 2021

నా భార్య నన్ను పెళ్లి చేసుకుని మోసపోయా అని చెప్పింది: మోహన్ బాబు

మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ బ్రదర్ అండ్ సిస్టర్స్‌గా నటించిన సైన్స్‌ ఫిక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ ‘మోసగాళ్లు’. టాలీవుడ్ కలెక్షన్ కింగ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. దగ్గుబాటి రానా ముఖ్య అతిథిగా హాజరుకాగా.. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన సునీల్ శెట్టితో పాటు కాజల్, నవదీప్ ఇతర నటీనటులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ని ఆశీర్వదిస్తూ మోహన్ బాబు అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘జీవితంలో ప్రతి వ్యక్తీ ఏదో విధంగా మోసపోతాడు. నా భార్య కూడా నాతో చెప్పింది.. ఏవండీ మిమ్మల్ని పెళ్లి చేసుకుని మోసపోయా అని. ఎందుకు అన్నదో నాకు అర్థం కాదు.. నేను ఆమెను మోసం చేశానో.. లేక ఆమె నన్ను మోసం చేసిందో నా పిల్లలు విష్ణు, మనోజ్, లక్ష్మిలకే తెలియాలి. ప్రతి వ్యక్తి ఇలా ఏదో విధంగా మోసపోతూ ఉంటాడు. నేను ఎక్కడా మోసపోను అని అంటుంటారు. అది జరగని పని. ఈ ‘మోసగాళ్లు’ సినిమా అత్యద్భుతమైన కథ. భారత దేశంలోనే నాకు తెలిసి ఇటువంటి స్కామ్ జరగలేదు. ముఖ్యంగా యూత్ చూడాల్సిన సినిమా. కంప్యూటర్ ద్వారా ఎన్ని కోట్ల రూపాయిలు సంపాదించారు. ఎలా మోసం చేశారో తెలిపే అద్భుతమైన కథ. ధైర్యం చేసి విష్ణు ఈ సినిమా చేశాడు. బొంబాయి వెళ్లి దాదాపు ఏడాది పాటు ఈ సినిమాపై రీసెర్చ్ చేసి తీశాడు. ఎందుకు హీరో మోసం చేశాడు... ఎందుకు హీరో సిస్టర్ మోసం చేసింది అంటే.. తల్లిదండ్రులు ఒక చిన్న గుడిసెలో ఉంటూ వాళ్లకి జరిగిన అవమానం భరించలేక.. అక్క తమ్ముడూ కలిసి మోసం చేయాల్సిందే అని డిసైడ్ అవుతారు. ఈ సినిమాలో అక్క, తమ్ముడు మధ్య వచ్చే సీన్లు చూసి నాకు ఒళ్లు జలజరించింది. ప్రతి సినిమాకి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాం.. మా సినిమా అదీ ఇదీ అని. కానీ ఈ సినిమా నిజంగానే అత్యుద్భుతం. బిడ్డని పొగడకూడదని అంటారు.. సభలో పొగడకూడదట.. రహస్యంగా పొగడాలట. ఈ సినిమాలో విష్ణు చేసిన పెర్ఫామెన్స్ అద్భుతం. విష్ణు బాగా చేస్తాడు కనుకునే ఇంతమంచి నటుడు అయ్యాడు. విష్ణు వండర్ ఫుల్ ఆర్టిస్ట్. సునీల్ శెట్టి, రాజా రవీంద్రా, కాజల్, నవదీప్ అందరూ అద్భుతంగా చేశారు.. మార్చి 19 నా పుట్టిన రోజు.. ఆరోజున ఈ సినిమా విడుదలౌతుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ‘మోసగాళ్లు’. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’ అంటూ తన స్పీచ్ ముగించారు మోహన్ బాబు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vpyXlz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...