Thursday, 18 March 2021

అఫీషియల్: నాగార్జునతో రొమాన్స్‌కి రెడీ అయిన కాజల్ అగర్వాల్.. కొత్త పెళ్లి కూతురికి క్రేజీ ఆఫర్

సీనియర్ హీరోలకు బెటర్ ఛాయిస్ అవుతోంది బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇటీవలే తన ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్.. పెళ్లి తర్వాత కూడా కెరీర్ కొనసాగిస్తూ దూసుకుపోతోంది. పెళ్లికి ముందు కమిటైన సినిమాలు కంప్లీట్ చేస్తూనే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కినేని హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు అఫీషియల్ స్టేట్‌మెంట్ వచ్చింది. ఇటీవలే 'వైల్డ్ డాగ్' షూటింగ్ ఫినిష్ చేసిన నాగార్జున.. తన తదుపరి సినిమాను దర్శకత్వంలో చేయబోతున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను గత నెలలోనే ప్రారంభించారు. అయితే ఇందులో నాగ్ సరసన నటించే హీరోయిన్ విషయంలో ఇన్ని రోజులు నెలకొన్న సస్పెన్స్‌కి తాజాగా తెర దించారు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. ఈ సినిమాలో నాగార్జునతో రొమాన్స్ చేయబోయేది కాజల్ అగర్వాల్ అని తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఆమెకు వెల్‌కమ్ చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో వేసిన ప్రత్యేకమైన సెట్స్‌పై జరుగుతోంది. అతిత్వరలో ఈ టీమ్‌తో కాజల్ జాయిన్ కానున్నట్లు సమాచారం. చిత్రంలో కాజల్ రోల్ కీలకంగా ఉంటుందని, నాగార్జున- కాజల్‌పై షూట్ చేయబోయే సన్నివేశాల పట్ల ప్రవీణ్ సత్తారు స్పెషల్ కేర్ తీసుకోనున్నారని టాక్. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చిరంజీవి సరసన 'ఆచార్య' మూవీతో పాటు, హిందీలో 'ముంబై సాగా' సినిమా చేస్తోంది. ఇక ఆమె కీలక పాత్ర పోషించిన 'మోసగాళ్లు' మూవీ మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vFpdE7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...