అప్పట్లో ఫ్యామీలీ ఆడియన్స్‌ని ఉర్రూతలూగిస్తూ బాక్సాఫీస్ వసూళ్ళలో ప్రధాన భూమిక పోషించారు , సౌందర్య. అందాల ఆరబోత విషయంలో హద్దుల్లో ఉంటూ ప్రేక్షకలోకాన్ని అలరించిన ఘనత వీరి సొంతం. ఆ సమయంలో వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఓకే ప్రాంతం నుంచి వచ్చి టాలీవుడ్‌లో హీరోయిన్లుగా సెటిలైన వీళ్ళు చాలా స్నేహంగా మెదులుతూ ఒకరి విషయంలో ఒకరు ఏదీ దాచుకోకపోయేవారట. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో టాప్ సీక్రెట్ ఒకటి లీక్ చేసింది ఆమని. అప్పట్లో ''శుభలగ్నం, మిస్టర్ పెళ్లాం, శుభ సంకల్పం'' లాంటి సినిమాల్లో నటించి ఫుల్ ఫేమ్ అయిన ఆమని.. ప్రెజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తూ సపోర్టింగ్ రోల్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే కార్తికేయ హీరోగా రూపొందిన '' సినిమాలో గంగమ్మ పాత్ర పోషించింది ఆమని. ఈ రోల్ చాలా డిఫరెంట్‌గా ఉండటమే గాక సినిమాకు మేజర్ అసెట్ అవుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా దివంగత స్టార్ హీరోయిన్ సౌందర్య గురించి, ఆమె నటన గురించి ఆమని మాట్లాడింది. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమని.. తన వ్యక్తిగత విషయాల పట్ల ఓపెన్ అవుతూనే తోటి హీరోయిన్స్‌తో తనకున్న సంబంధాల గురించి కామెంట్స్ చేసింది. ఇందులో భాగంగా సౌందర్య తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పిన ఆమె.. కెమెరా ముందు సౌందర్య ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా ఉండేదని తెలిపింది. పెళ్లైతే భర్త ఎందుకలా ఎక్స్‌పోజింగ్ చేశావని అడుగుతారేమో అనే భయంతో సౌందర్య అలాంటి వాటికి నో చెప్పేదని ఆమని పేర్కొంది. ఈవిషయాన్ని సౌందర్యనే స్వయంగా తనతో చెప్పిందని ఆమని వెల్లడించడం విశేషం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lquLxo
v
No comments:
Post a Comment