Thursday, 18 March 2021

ఆవుమాంసంలో మత్తుమందు.. .. మైనర్ యువతిని పాడుచేసి వీడియోలు.. రెండుసార్లు అబార్షన్ ‘లవ్ జిహాద్’ కేసులో షాకింగ్ నిజాలు

కులం వేరు.. మతం వేరు.. అయినా నువ్వంటే నాకు ఇష్టం అని ఆమె వెంటపడ్డాడు.. ఆమెను ట్రాప్‌లోకి దించి ప్రేమ పేరుతో అనుభవించాడు. నీ కోసం నా మతం మార్చుకుంటా అని మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. తీరా ఇంటికి తీసుకుని వెళ్లి ఆమెను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి చిత్ర హింసలకు గురిచేశాడు. మూడేళ్లు పాటు నరకం అనుభవించి ఆ యువతి వాళ్ల చెర నుంచి విడిపించుకుని బయటకు వచ్చింది. నటి సాయంతో అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని కలిసి ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు ప్రకారం.. గుంటూరు ఏటీ అగ్రహారం ఎనిమిదో లైన్‌కు చెందిన యువతి హరికథపై ఉన్న ఆసక్తితో 2018లో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీకి వెళ్ళింది. అక్కడే కర్నూల్‌ జిల్లా ఆదోనికి చెందిన యువకుడు అహ్మద్‌ తషీఫ్‌‌తో పరిచయం ఏర్పడి.. ప్రేమగా మారింది. ఆ తరువాత ఆమెకు మాయమాటలు చెప్పి 2019లో లాడ్జికి తీసుకుని వెళ్లి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేశాడు.. వాటిని వీడియోలు తీసి.. విషయం బయటకు చెప్తే వీడియోలు బయటపెడతానని తనపై పలు మార్లు అత్యాచారం చేశాడని చెప్పింది ఆ యువతి. ఈ ఇష్యూపై గురువారం నాడు గుంటూరులో మీడియాతో మాట్లాడిన కరాటే కళ్యాణి.. ‘ఈ అమ్మాయి పేరు దివ్య. నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఆమె గురించి నేను ఇంత ఇంట్రస్ట్ తీసుకుని గుంటూరు వరకూ వచ్చాను అంటే.. ఈ అమ్మాయి హరిదాసురాలు. నేను కూడా హరికథ చెప్తాను. హరికథా పీఠం నాకు ఉంది. నాలాగే ఆమె కూడా హిందూ ధర్మం కోసం పాటుపడుతుంది. ఇలాంటి అమ్మాయి కూడా లవ్ జిహాద్‌కి గురికాబడింది. లవ్ జిహాద్ అనేది చాలా ఎక్కువైపోయింది. అహ్మద్‌ తషీఫ్‌‌ అనే అబ్బాయి ఈ అమ్మాయిని ట్రాప్ చేశాడు.. పెళ్లి చేసుకుని మూడు నెలల్లోనే నరకం అంటే ఏంటో చూపించాడు. ఈ అమ్మాయికి న్యాయం జరిగేవరకూ మేం పోరాడతాం. ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్థలు ఈ అమ్మాయికి న్యాయం చేయాలని నాతో పాటు ఇక్కడికి వచ్చాయి. ఇది ఒక్కరి సమస్య కాదు.. అందరి సమస్య కాబట్టి.. ఈ అమ్మాయిని మోసం చేసి మూడు నెలలు నరకం చూపించిన ఆ వెధవను మూడు చెరువులు నీళ్లు తాగించే వరకూ వదిలిపెట్టేది లేదు. హరినామస్మరణ చేసే ఈ అమ్మాయి నోటి వెంట.. అల్లా అని చెప్పించి బలవంతంగా మత మార్పిడి చేసి నరకం చూపించారు వీటన్నింటికీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పింది కరాటే కళ్యాణి. ఇక బాధితురాలు మాట్లాడుతూ.. ‘నేను అహ్మద్‌ తషీఫ్‌ అనే యువకుడు ఒకే యూనివర్సిటీలో కలిసి చదువుకున్నాం.. గుంతకల్ పత్తిపాడు పంచాయితీ రాజ్ శాఖలో వాళ్ల నాన్న ప్రభుత్వ ఉద్యోగి. తషీఫ్ నాతో పరిచయం పెంచుకుని ట్రాప్ చేశాడు.. నాకు మత్తుమందు ఇచ్చి బలవంతం చేశాడు. నాకోసం అతను మతం మార్చుకుంటా అని చెప్పాడు.. నా వెంట పడ్డాడు. తారక్ అని పేరు మార్చుకుని నన్ను పెళ్లి చేసుకున్నాడు. తరువాత వాళ్ల ఊరు తీసుకుని వెళ్లి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్పించాడు. ఆ తరువాత వాళ్ల సాంప్రదాయంలో పెళ్లి జరిపించి చిత్ర హింసలకు గురిచేశారు. వాళ్ల అమ్మ, చెల్లి, నాన్న, మామ నాపై దాడి చేశారు. నా దగ్గర ఫోన్ కూడా లాగేసుకున్నారు. అతి కష్టం మీద మా పేరెంట్స్‌కి లొకేషన్ పంపించడంతో వాళ్లు వచ్చి నన్ను సేవ్ చేశారు. ఆ రోజు నుంచి నన్ను బెదిస్తూనే ఉన్నారు. భయపడి ఇన్నాళ్లూ బయటకు రాలేదు. కానీ నాలాంటి వాళ్లు చాలామంది ఉన్నారని బయటకు వచ్చాను. ఆవుమాసంలో నల్లమందు కలిపి పెట్టేవారు.. నేను కన్యనా కాదా అని టెస్ట్‌లు చేశారు. బాగా కొట్టేవారు. నన్ను దారుణంగా రేప్ చేశారు. వచ్చేటప్పుడు నాతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. మూడు సార్లు తలాక్ అని చెప్పాడు ఆ అబ్బాయి. నాకు రెండుసార్లు అబార్షన్ చేయించారు. నన్ను చంపడానికి కూడా ట్రై చేశారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో పరిచయం అయ్యాడు. లవ్ చేస్తున్నానని నా వెంట పడ్డాడు. నాది గుంటూరు.. అతనిది గుంతకల్. నన్ను ట్రాప్ చేసి లవ్‌లోకి దించాడు. నువ్ నాతో ఉండకపోతే.. ఇద్దరం సన్నిహితంగా ఉన్న ఫొటోలను వీడియోలను లీక్ చేస్తానని బెదిరించేవాడు. ఆ వీడియోలను చూపించి నన్ను అనుభవించేవాడు. మూడేళ్లుగా అతనితో నాకు పరిచయం ఉంది. ఇన్నాళ్లూ పరువుపోతుందని భయంతో ముందుకు రాలేదు. నన్ను ఇంత చిత్రహింసలకు గురిచేసిన వాళ్లకి తగిన శిక్షపడాలని కోరుతున్నా. నాకు జరిగిన అన్యాయం వేరే అమ్మాయికి జరగకూడదనే ఈరోజు మీడియా ముందుకు వచ్చాను’ అంటూ మీడియా ముందు చెప్పింది బాధితురాలు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38W1ghQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...