Tuesday, 23 March 2021

‘ఫస్ట్ నైట్ మంచమెక్కిన పెళ్ళాంతో సంసారం చెయ్యనంటే అన్యాయం కదా’!! మళ్లీ కెలికాడు

ఒక్కొక్కరికీ ఒక్కో ఆనందం.. కొంతమందికి పొగిడించుకోవడం ఇష్టం అయితే బండబూతులు తిట్టించుకోవడాన్ని కూడా వినోదంగా భావిస్తుంటారు ఇంకొంతమంది. ఇదిగో మూవీ క్రిటిక్ మహేష్ కత్తిది కూడా అదే బాపతు. అధినేత అభిమానులు ఎన్నిసార్లు హెచ్చిరించినా.. చంపేస్తాం అని బెదిరించినా.. సోషల్ మీడియాలో బండబూతులు తిట్టి దారుణంగా ట్రోల్ చేసినా.. ఖాతరు చేయడం కాదు కదా.. ఇంకా ఇంకా గిచ్చుతూనే ఉన్నారు కత్తి మహేష్. జనసేన-బీజేపీ మైత్రి గురించి తొలి నుంచి ‘కత్తి’ పోట్లు పొడుస్తున్న కత్తి మహేష్.. తిరుపతి బై ఎలక్షన్ నేపథ్యంలో జనసేనాని సొంత పార్టీని అభ్యర్థిని ప్రకటించకుండా బీజేపీకి జైకొట్టడంతో కత్తి దూశాడు కత్తి మహేష్. తన ఫేస్ బుక్ అకౌంట్ నుంచి వరుసగా పోస్ట్ పెడుతూ గిచ్చుతున్నాడు. ‘పాచిపోయిన లడ్డుల్ని పవిత్రమైన లడ్డులని వెంకన్న సాక్షిగా అబద్ధం చెప్పలేక... తిరుపతిలో ప్రచారానికి రానన్న పవన్ కళ్యాణ్. గుర్రుగా సోము వీర్రాజు. వారిద్దరికీ నా అభినందనలు’ అంటూ బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్‌ భేటీ అయిన ఫొటోని షేర్ చేశారు కత్తి మహేష్. అంతటితో ఆగితే అది కత్తి మహేష్ ఎందుకు అవుతాడు.. పోస్ట్‌లలో ఇంకాస్త ఘాటు పెంచుతూ మరికొన్ని వదిలాడు. ‘పెళ్లంటూ చేసుకున్నాక కలుపుకెళ్లే పనిచూడాలిగానీ.. ప్రతిరోజూ కెలుకుడు యవ్వరాలేంది పవన్ కల్యాణు? స్థానిక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశానికి కన్ను కొడితివి. తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆరెస్‌తో రొమాన్స్ నడిపితివి. తిరుపతిలో సీటిఛ్చి, ప్రచారం చెయ్యనంటే... ఫస్ట్ నైట్ మంచమెక్కిన పెళ్ళాంతో సంసారం చెయ్యను అన్నట్టే కదా! అన్యాయం కదా పవనూ!!’ అంటూ పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేశాడు కత్తి మహేష్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3f5Y07s
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...