Tuesday, 23 March 2021

అందరూ బావుండాలి అందులో నేనుండాలి అంటున్న ఆలీ.. కాశ్మీర్‌లో హీరోయిన్‌తో రొమాంటిక్ డ్యూయెట్

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా తనదైన మార్క్ చూపిస్తూ దూసుకెళ్తున్నారు కమెడియన్ . తనకంటూ ప్రత్యేకం అన్నట్లుగా ఆయన చెప్పే డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆలీకి కొన్ని వందల హిట్స్ తెచ్చిపెట్టాయి. ఆయన కెరీర్‌లో బెస్ట్ సినిమాల లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంటుంది. అలా ప్రేక్షకులకు ఓ రేంజ్‌లో కితకితలు పెట్టిన ఆలీ.. హీరోగా కూడా సత్తా చాటారు. అంతటితో ఆగక బుల్లితెరపై కూడా హవా నడిపిస్తున్న ఆయన ఇప్పుడు నిర్మాతగా మారి '' అనే మూవీ రూపొందిస్తున్నారు. మలయాళంలో సూపర్ సక్సెస్ సాధించిన వికృతి మూవీ ఆధారంగా ఈ 'అందరూ బావుండాలి అందులో నేనుండాలి' చిత్రం రూపొందుతోంది. అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అలీ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీపురం కిరణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్‌ నిర్మిస్తున్నారు. ఆలీ హీరోగా నటిస్తుండగా మౌర్యాని, మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సనా, వివేక్, సప్తగిరి, పృధ్వీ, రామ్‌జగన్, భద్రం, లాస్య, ప్రణవి మానుకొండ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాకేశ్‌ పళిదం సంగీతం అందిస్తున్నారు. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఇప్పటికే మేజర్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం కాశ్మీర్‌లోని అందమైన లొకేషన్స్‌లో ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ చేస్తున్నారు. ''నా గుండె చిక్కుకుంది నీ కళ్లతో..'' అంటూ సాగే ఈ పాటను భాస్కరభట్ల రవికుమార్ రచించగా రాకేశ్‌ పళిదం బాణీలు కడుతున్నారు. అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనుంది చిత్రయూనిట్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3remsGm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...