Monday, 15 March 2021

ఆనంద్ దేవరకొండ దూకుడు.. ఒకే రోజు మూడు సినిమాల ప్రకటన

‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ చిత్రాలతో కమర్షియల్ సక్సెస్‌‌ను అందుకోవడంతో పాటు ప్రతిభ గల హీరోగా పేరు తెచ్చుకున్నారు ఆనంద్ దేవరకొండ. క్రేజీ సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోగా మారారు. ఈరోజు (మార్చి 15న) పుట్టినరోజు జరుపుకుంటున్న ఆనంద్ దేవరకొండ తన మూడు కొత్త సినిమాలను ప్రకటించారు. ఆ కొత్త సినిమాల వివరాలు ఒకసారి చూస్తే.. మధుర శ్రీధర్‌రెడ్డి నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ సినిమా చేస్తున్నారు. బలరాం వర్మ నంబూరి, బాల సోమినేని చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని మధుర ఎంటర్‌టైన్మెంట్స్, రోల్ కెమెరా విజువల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరు అనే వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఆనంద్ దేవరకొండ ప్రకటించిన మరో చిత్రాన్ని హై లైఫ్ ఎంటర్‌టైన్మెంట్ ప్రొడక్షన్ సంస్థ తన తొలి చిత్రంగా నిర్మిస్తోంది. కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలు. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు ఉదయ్ శెట్టి రూపొందించనున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రకటించాల్సి ఉంది. ఇక ఇంకో సినిమా ప్రతిష్టాత్మక సురేష్ ప్రొడక్షన్స్‌లో చేయబోతున్నారు ఆనంద్ దేవరకొండ. దానికి సంబంధించి అధికారిక ప్రకటన చేయకపోయినా సినిమా మాత్రం ఖరారైంది. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాతో కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు. మరోవైపు ఆనంద్ దేవరకొండ హీరోగా విడుదలకు సిద్ధమవుతోన్న ‘పుష్పక విమానం’ నుండి ‘సిలకా’ అనే పాటను ఈరోజు విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ఈ సినిమాకు విజయ్ దేవరకొండ సమర్పకుడిగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lgl0lk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...