Monday, 15 March 2021

ఆమిర్ ఖాన్ షాకింగ్ నిర్ణయం.. ఇక తప్పుకుంటున్నా అంటూ కీలక ప్రకటన

బాలీవుడ్ ప్రముఖ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్‌గా పిలుపించుకునే ఆమిర్ ఖాన్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం తన 56వ పుట్టినరోజును జరుపుకున్న ఆమిర్.. ఆ మరునాడే తాను సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సోమవారం తన అభిమానులకు ఒక సందేశం ఇచ్చారు. సోషల్ మీడియాలో ఇదే తన ఆఖరి సందేశం అని స్పష్టం చేశారు. అయితే, అభిమానులకు కాస్త ఊరటను ఇస్తూ తన సినిమాలకు సంబంధించిన ప్రకటనలను సొంత నిర్మాణ సంస్థ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ (ఏకేపీ) అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు. తనకు సంబంధించి, తన సినిమాలకు సంబంధించి అప్‌డేట్స్ ఏకేపీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. ‘‘అందరికీ నమస్కారం, నా పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు తెలిపిన, నాపై ప్రేమ కురిపించిన అందరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమతో తన హృదయం నిండిపోయింది. ఇంకో విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో ఇది నా ఆఖరి పోస్ట్. నేను సోషల్ మీడియాలో లేకపోయినా గతంలో మాదిరిగానే మనం కమ్యూనికేట్ అవుదాం. ఏకేపీ (ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్) తన అధికారిక ఖాతాను తెరిచింది. కాబట్టి భవిష్యత్తులో నా అప్‌డేట్స్, నా సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ పేజ్‌లో తెలుసుకోవచ్చు’’ అని ఆమిర్ ఖాన్ తన సందేశంలో పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tlmL3E
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...