Tuesday, 2 March 2021

రష్మిక మందన జడలో మల్లెపూలు.. అభిమాని చేసిన పని చూసి షాకవుతున్న జనం.. వీడియో వైరల్

హీరోహీరోయిన్ల అభిమానులు ఎప్పుడూ తమ తమ ఫేవరేట్ స్టార్స్ కోసం కొత్తగా ఏం చేయాలని చూస్తుంటారు. వాళ్ళ సినిమా విడుదలైనా, పుట్టినరోజు లాంటి వేడుక జరిగినా నానా హంగామా చేస్తుంటారు. భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం, సినిమా పోస్టర్స్‌కి దండలు వేయడం, పాలాభిషేకం చేయడం లాంటి పనులు చేస్తూ తెగ సంబరపడతారు. కానీ అభిమాని ఒకరు కాస్త వెరైటీగా ఆలోచించి ఆమె జడలో పూలు పెట్టాడు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కన్నడ చిత్రం ‘’ సినిమాను అదే పేరుతో ఇటీవలే తెలుగు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. నందన్‌ కిషోర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ధృవ సర్జా, రష్మిక మందన జంటగా నటించారు. ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. అయితే ఓ థియేటర్‌లో ఈ మూవీ పోస్టర్‌పై ఉన్న రష్మిక జడలో పూలు పెట్టి అభిమానాన్ని చాటుకున్నారు ఆమె ఫ్యాన్స్. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 'నేను మీకు పెద్ద అభిమానిని మేడం' అని ట్యాగ్ చేశారు. డిఫరెంట్ ఆలోచనతో అభిమానులు ఇలా చేయడం చూసి షాక్ అవుతున్నారు జనం. 'కిరిక్ పార్టీ' అనే కన్నడ మూవీతో సినీ గడప తొక్కిన రష్మిక మందన.. ఆ తర్వాత 'ఛలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ వెంటనే ''గీతా గోవిదం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ'' లాంటి వరుస హిట్స్ ఆమె ఖాతాలో పడటంతో క్రేజీ హీరోయిన్‌గా మారి తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను కూడగట్టుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో, శర్వానంద్ హీరోగా రాబోతున్న ‘ఆడాళ్లు మీకు జోహార్లు ’ అనే సినిమాలో నటిస్తోంది రష్మిక.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sJIaTw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...