Tuesday, 2 March 2021

‘దృశ్యం 2’ ప్రారంభం.. మలయాళ దర్శకుడితో జతకట్టిన వెంకీ

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం 2’ తెలుగు రీమేక్ కోసం ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్‌తో విక్టరీ వెంకటేష్ చేతులు కలిపిన సంగతి తెలిసిందే. మలయాళ ‘దృశ్యం 2’కు జీతూ జోసెఫ్ దర్శకుడు. ఓటీటీ ద్వారా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో తెలుగు ‘దృశ్యం 2’ లాంఛనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెంకటేష్, డి.సురేష్ బాబు, జీతూ జోసెఫ్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు. ‘దృశ్యం 2’ తెలుగు రీమేక్ ప్రారంభమైన విషయాన్ని డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. మార్చి 5 నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని పేర్కొన్నారు. ప్రారంభోత్సవ ఫొటోను కూడా షేర్ చేశారు. 2014లో వచ్చిన ‘దృశ్యం’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మలయాళంలో మోహన్‌లాల్ పోషించిన పాత్రలో వెంకటేష్ నటించారు. మీనా, ఎస్తర్ అనిల్ తెలుగులోనూ అవే పాత్రలు పోషించారు. డైరెక్టర్ జీతూ జోసెఫ్ స్థానాన్ని మాజీ నటి శ్రీప్రియ భర్తీ చేశారు. మలయాళంలో మాదిరిగానే తెలుగులోనూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ‘దృశ్యం 2’ డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెలుగు వర్షన్‌కూ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరోవైపు, వెంకటేష్ ప్రస్తుతం ‘F3’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్‌లతో కలిసి మరోసారి వినోదాన్ని పంచడానికి వెంకీ సిద్ధమవుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. వెంకటేష్ ఇప్పటికే ‘నారప్ప’ షూటింగ్ పూర్తిచేశారు. ‘అసురన్’కు రీమేక్‌గా వస్తోన్న ఈ చిత్రం మే 14న విడుదలకానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MBik4O
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...