Tuesday, 2 March 2021

బయటికి కనిపించేంత సాఫ్ట్ కాదు.. జగపతిబాబు డార్క్ సీక్రెట్స్!!

దక్షిణాది సినీ పరిశ్రమలోని విలక్షణ నటుల్లో జగపతిబాబు ఒకరు. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఫేవరేట్ హీరోగా పాపులారిటీ సంపాదించిన జగపతిబాబు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో అన్నయ్యగా, తండ్రిగా, ప్రతినాయకుడిగా సత్తా చాటుతున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ స్టార్ హీరోలకు విలన్‌గా నటిస్తున్నారు. అయితే, నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతోన్న ‘టక్ జగదీష్’ సినిమాలో జగపతిబాబు ఒక కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన టీజర్‌లో జగపతిబాబు చాలా సాఫ్ట్‌గా, ఒక ఉమ్మడి కుటుంబంలో సభ్యుడిగా కనిపించారు. ఈ ఫ్యామిలీ డ్రామాలో నానికి అన్నయ్యగా జగపతిబాబు కనిపించనున్నారు. అయితే ఈ అన్నయ్య.. ‘మా అన్నయ్య’, ‘పెద్దన్నయ్య’ సినిమాల్లోన్ని అన్నయ్య టైపు కాదట. కాస్త తేడా అని అంటున్నారు. జగపతిబాబు పాత్రకు సంబంధించి ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఇంట్రస్టింగ్ గాసిప్ చక్కర్లు కొడుతోంది. టీజర్‌లో చూపించినట్టుగా కాకుండా జగపతిబాబు పాత్రలో డార్క్ సీక్రెట్స్ ఉంటాయట. ఆ సీక్రెట్స్, పాత్ర నెగిటివ్ షేడ్స్ ఈ సినిమాలో మేజర్ ట్విస్ట్ అని అంటున్నారు. మరి ఈ రూమర్‌లో నిజమెంతో తెలియాలంటే సినిమా విడుదలయ్యేంత వరకు ఆగాల్సిందే. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/381eBVS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...