Wednesday, 3 March 2021

తనే నా బాయ్‌ఫ్రెండ్ అంటూ ఇలియానా ఓపెన్.. కొత్త లవర్ పేరు బయటపెట్టి షాకిచ్చిన గోవా బ్యూటీ!

'దేవదాసు' సినిమాతో టాలీవుడ్ తెరకు కొత్త అందాల రుచి చూపించింది గోవా బ్యూటీ . మొదటి సినిమాలోనే గ్లామర్ డోస్ దట్టించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస ఆఫర్స్ పట్టేసి తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ''పోకిరి, మున్నా, జల్సా, రాఖీ, కిక్'' లాంటి సినిమాలతో పలు బ్లాక్ బస్టర్ సినిమాలు ఖాతాలో వేసుకొని ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లో నటించింది. ఆ సమయంలోనే విదేశీ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేసి బ్రేకప్ చెప్పిన ఈ బ్యూటీ.. తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తన కొత్త బాయ్ ఫ్రెండ్‌ని పరిచయం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించిన ఇలియానా.. ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ అనే లైవ్ చాట్‌లో పాల్గొని నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఓపెన్‌గా సమాధానాలు చెప్పింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్ 'మీ కొత్త బాయ్‌ఫ్రెండ్‌ పేరేమిటి?' అనే ప్రశ్న వేయగా, ఏ మాత్రం తడుముకోకుండా తన పెంపుడు కుక్కను చూపించింది. అంతేకాదు వీడు 'ఛార్లీ' అంటూ పేరు కూడా బయటపెట్టింది. దీంతో ఆ కుక్కకు కంగ్రాట్స్ చెబుతూ చమత్కరిస్తున్నారు నెటిజన్లు. ఇక ఇలియానా కెరీర్ విషయానికొస్తే.. బాలీవుడ్ గడప తొక్కాక చాలా ఏళ్లకు 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చి తిరిగి అక్కడికే చేరుకుంది. ప్రస్తుతం ఆమె ''అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ, ది బిగ్‌ బుల్‌'' అనే హిందీ సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోషూట్స్, అప్‌డేట్స్ పోస్ట్ చేస్తోంది ఇలియానా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sGHWgb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...