Wednesday, 3 March 2021

నాని సినిమాపై కోర్టుకెక్కిన నటి.. నిర్మాతలపై పరువు నష్టం దావా

ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థపై మోడల్, నటి సాక్షి మాలిక్ కోర్టుకెక్కారు. తన అనుమతి లేకుండా ‘వి’ సినిమాలో తన ఫొటోను వాడారని ఆరోపిస్తూ సాక్షి మాలిక్ బోంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. ‘సోను కి టిట్టు కి స్వీటీ’ సినిమాలోని ‘బామ్ డిగ్గీ డిగ్గీ’ పాట ద్వారా పాపులర్ అయిన సాక్షి మాలిక్ వేసిన పిటిషన్‌ను విచారించిన బోంబే హైకోర్టు.. ‘వి’ చిత్రం స్ట్రీమింగ్ అవుతోన్న ఓటీటీ ప్లాట్‌ఫాంకు ఆదేశాలు జారీ చేసింది. ఓటీటీ నుంచి తక్షణమే సినిమాను తొలగించాలని.. సాక్షి మాలిక్ అభ్యంతరం తెలిపిన సన్నివేశాన్ని కూడా సినిమా నుంచి తొలగించాలని ఆదేశించింది. నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితీ రావు హైదరి ప్రధాన తారాగణంగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘వి’ లాక్‌డౌన్ సమయంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా విడుదలైంది. మొబైల్ ఫోన్‌లో కమర్షియల్ సెక్స్ వర్కర్ ఫొటోను వేరే వ్యక్తికి చూపించే సన్నివేశం ఈ సినిమాలో ఉంది. ఆ ఫొటో తనదేనని సాక్షి మాలిక్ కోర్టుకెక్కారు. దీంతో కోర్టు సినిమా నిర్మాతలకు అక్షింతలు వేసింది. అనుమతి లేకుండా వేరొకరి ఫొటోను, మరీ ముఖ్యంగా ప్రైవేట్ ఇమేజ్‌ను ఎలాబడితే అలా వాడేయడం చట్టవిరుద్ధమని, పూర్తిగా అక్రమమని కోర్టు పేర్కొంది. ఫొటో వాడకాన్ని బట్టి ఇది పరువునష్టం దావా కిందికి కూడా రావచ్చని ధర్మాసనం హెచ్చరించింది. కాగా, ‘వి’ సినిమాను ఇప్పటికే ఓటీటీ ప్లాట్‌ఫాం నుంచి తొలగించారు. కోర్టు ఆదేశాల మేరకు అభ్యంతరకర సన్నివేశాన్ని నిర్మాతలు తొలగించిన తరవాత మాత్రమే మళ్లీ ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి సినిమాను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, అప్‌లోడ్ చేయడానికి ముందు సినిమాను సాక్షికి, ఆమె లాయర్‌కు చూపించాలి. మరోవైపు, సాక్షి ఫొటోను ఒక ఏజెన్సీ నుంచి నిర్మాతలు తీసుకున్నారని.. ఆ ఏజెన్సీ సాక్షి నుంచి అనుమతి తీసుకొని ఉంటుందని వారు భావించారని సమాచారం. ఏదేమైనా ఒక మోడల్‌ను ఆమె అనుమతి తీసుకోకుండా సెక్స్ వర్కర్‌గా చూపిండం తప్పు. మరోవైపు, సాక్షి మాలిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా పాపులర్. ఆమెకు ఇన్‌స్టాలో 6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uN8vC5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...