Wednesday, 3 March 2021

తెలంగాణ పిల్లగా కృతి శెట్టి.. పోసానితో రొమాన్స్‌ చేస్తున్న 'ఉప్పెన' బ్యూటీ!!

సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్స్ మొదటి సినిమాతోనే లక్కీ లెగ్ అవుతుంటారు. అలాంటి వారి లిస్ట్‌లో చేరిపోయింది 'ఉప్పెన' బ్యూటీ . ఈ సినిమాలో డెబ్యూ హీరో వైష్ణవ్ తేజ్ సరసన రొమాన్స్ చేసి తనలోని నటనా ప్రతిభను తెలుగు ప్రేక్షకుల ముందుంచింది. ఎమోషన్ సీన్స్‌లో సీనియర్ హీరోయిన్స్ లెవెల్ పర్‌ఫార్‌మెన్స్ కనబర్చింది. దీంతో తెలుగు దర్శకనిర్మాతల చూపు ఆమెపై పడింది. కన్నడ భామనే అయినా ఈ అమ్మడికి వరుస అవకాశాలు తలుపుతడుతున్నాయి. ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో మూడు సినిమాలున్నాయి. ఇప్పటికే నాని సినిమాలో అవకాశం వచ్చింది. 'టాక్సీవాలా' ఫేమ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్, నాని కాంబినేషన్‌లో వస్తోన్న 'శ్యామ్ సింగరాయ్‌' సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిన కృతి.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా రానున్న కొత్త సినిమాలో కూడా హీరోయిన్‌గా ఛాన్స్ పట్టేసిందనే టాక్ ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ చిన్నది.. తెలంగాణ అమ్మాయిగా అదరగొట్టబోతుందని తెలుస్తోంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో పోసాని హీరోగా నటిస్తున్నాడు. చిత్రానికి ‘’ అనే ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఇందులో కృతి శెట్టి రోల్ మేజర్ అట్రాక్షన్ కానుందని సమాచారం. హైద‌రాబాదీ అమ్మాయి పాత్ర‌లో ఆమె కనిపించనుందట. తెలంగాణ యాసలో అందరినీ కట్టిపడేసే డైలాగ్స్ కృతి శెట్టి చెప్పనుందని తెలుస్తోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ ప‌తాకంపై గాజుల‌ప‌ల్లి సుధీర్ బాబు స‌మ‌ర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి.మ‌హేంద్రబాబు, కిర‌ణ్ బ‌ల్లప‌ల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2O0pzE2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...