Wednesday, 3 February 2021

‘సోలో బ్రతుకే సో బెటర్’ క్లోజింగ్ కలెక్షన్స్: సాయి తేజ్ బొమ్మ హిట్టు

సుమారు 10 నెలల విరామం తరవాత తెరుచుకున్న సినిమా థియేటర్లలో విడుదలైన తొలి భారీ చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ చిత్రం విడుదలైంది. ప్రభుత్వం థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ పెట్టినా ధైర్యంగా సినిమాపై ఉన్న నమ్మకంతో చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు వమ్ము చేయలేదు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాను హిట్ చేసి ఖాతాలో మరో విజయాన్ని చేర్చారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 12 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను రూ.10 కోట్లకు విక్రయించినట్టు సమాచారం. దీన్ని బట్టి ‘సోలో బ్రతుకే సో బెటర్’ డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. అంటే, బొమ్మ హిట్. ఈ సినిమాను జీ స్టూడియోస్ సంస్థ విడుదల చేసింది. అయితే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి వంటి జిల్లాల థియేట్రికల్ రైట్స్‌ను విడిగా విక్రయించారట. అక్కడ కూడా ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్టింది. 50 శాతం ఆక్యుపెన్సీ‌తో సైతం ఈ సినిమా విజయం సాధించడంతో సంక్రాంతికి మరిన్ని సినిమాలు విడుదల కావడానికి మార్గం సుగమమైంది. కాగా ‘చిత్రలహరి’, ‘ప్రతిరోజూ పండగే’ విజయాల తర్వాత సాయి ధరమ్ తేజ్ ఖాతాలో ‘సోలో బ్రతుకే సో బెటర్’తో మరో హిట్ చేరింది. దీంతో తేజూ హ్యాట్రిక్ విజయాలు అందుకున్నట్టయింది. ప్రాంతాల వారీగా ఈ సినిమా క్లోజింగ్ షేర్స్ ఇలా ఉన్నాయి.. నైజాం - రూ.3.60 కోట్లు సీడెడ్ - రూ. 2.60 కోట్లు ఉత్తరాంధ్ర - రూ.1.40 కోట్లు గుంటూరు - రూ. 95 లక్షలు తూర్పుగోదావరి - రూ. 95 లక్షలు పశ్చిమగోదావరి - రూ. 65 లక్షలు కృష్ణా - రూ. 65 లక్షలు నెల్లూరు - రూ. 50 లక్షలు ఆంధ్ర, తెలంగాణ మొత్తం - రూ. 11.30 కోట్లు ఇండియాలో ఇతర ప్రాంతాలు - రూ. 75 లక్షలు ఓవర్సీస్ - రూ. 35 లక్షలు మొత్తం - రూ. 12.40 కోట్లు


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36FB0HD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...