Wednesday, 3 February 2021

పెళ్లి పీటలు ఎక్కుతోన్న హీరో సుమంత్ అశ్విన్.. డేట్ ఫిక్స్

ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్.రాజు కుమారుడు, హీరో ఓ ఇంటివాడవుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన దీపిక అనే అమ్మాయిని ఆయన పెళ్లాడబోతున్నారు. వీరి వివాహం ఈనెల 13న హైదరాబాద్‌లో జరగనుంది. వాలంటైన్స్ డేకు ఒక్కరోజు ముందు సుమంత్ పెళ్లి చేసుకుంటుడం విశేషం. ప్రస్తుతం సుమంత్ వయసు 32 ఏళ్లు. కాగా, ఈ వివాహ వేడుక పరిమిత సంఖ్యలో బంధుమిత్రుల మధ్య జరగనుందని సమాచారం. కాగా, సుమంత్ అశ్విన్ ‘తూనీగ తూనీగ’ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమాకు ఆయన తండ్రి ఎం.ఎస్.రాజు దర్శకుడు. 2012లో ఈ సినిమా విడులైంది. అయితే, 2015లో వచ్చిన ‘కేరింత’ సినిమాతో సుమంత్ అశ్విన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరవాత ‘కొలంబస్’, ‘రైట్ రైట్’, ‘ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘ప్రేమకథా చిత్రమ్ 2’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఎం.ఎస్.రాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుమంత్ అశ్విన్ ఇంకా తన మార్కు చూపించలేదు. ఆయన మార్కెట్ అంతంత మాత్రంగానే ఉంది. ప్రస్తుతం సుమంత్ ‘ఇదే మా కథ’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్, భూమిక, తాన్య హోప్‌లతో కలిసి ఆయన నటిస్తున్నారు. మరోవైపు, సుమంత్ తండ్రి ఎం.ఎస్.రాజు ఎంత గొప్ప నిర్మాతో అందరికీ తెలిసిందే. ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘నీ స్నేహం’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఎం.ఎస్.రాజు టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతగా ఎదిగారు. అయితే, ఆ తరవాత వరుస పరాజయాలతో వెనకబడిపోయారు. 2009లో వచ్చిన ‘మస్కా’ సినిమా తర్వాత మళ్లీ ఎం.ఎస్.రాజు మరో సినిమాను నిర్మించలేదు. కానీ, ఈ ఏడాది ‘డర్టీ హరి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రాజు. కాకపోతే నిర్మాతగా కాదు దర్శకుడిగా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cyYIsM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...