Wednesday, 3 February 2021

రవితేజ ‘ఖిలాడి’లో అనసూయ.. గేమ్ చేంజర్ అట!

మాస్ మహారాజా హీరోగా రూపొందుతోన్న ‘ఖిలాడి’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవలే ఆయన షూటింగ్‌లో పాల్గొన్నారు. కాగా, ఈ చిత్రంలో స్టార్ యాంకర్ భరద్వాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈరోజు నుంచి ఆమె చిత్రీకరణలో కూడా పాల్గొంటున్నారు. అనసూయకు స్వాగతం చెబుతూ చిత్ర దర్శకుడు రమేష్ వర్మ బుధవారం ట్వీట్ చేశారు. ‘‘మేం మరింత స్మార్ట్‌గా ఆడబోతున్నాం. ఎందుకంటే, ఈ లేడీ ఒక గేమ్ చేంజర్. మా ప్రియాతి ప్రియమైన అనసూయ భరద్వాజ్‌కు స్వాగతం’’ అని రమేష్ వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు. పోస్టర్ కూడా షేర్ చేశారు. అనసూయ పాత్ర సినిమాలో చాలా కీలకమట. కొన్ని రోజుల క్రితమే ఆమె ఈ సినిమాను సైన్ చేశారని సమాచారం. గడిచిన మూడు వారాలుగా వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ‘ఖిలాడి’ చిత్రీకరణ జరుగుతోంది. నేడు షూటింగ్‌లో పాల్గొనడానికి అనసూయ విశాఖపట్నం వెళ్లినట్టు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే 28న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పెన్ స్టూడియోస్ పతాకంపై కోనేరు సత్యనారాయణ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jefkrd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...