Wednesday, 3 February 2021

నితిన్ ‘చెక్’ ట్రైలర్: ఒక టెర్రరిస్ట్‌తో చెస్ ఆడిస్తారా?

కిందటేడాది ‘భీష్మ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో నితిన్.. ఈ ఏడాది ‘చెక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ఖైదీగా కనిపించనున్నారు. నితిన్ సరసన ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌గా నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ కీలకమైన లాయర్ పాత్రను పోషించారు. కళ్యాణి మాలిక్ సంగీతం సమకూరుస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ఈనెల 26న విడుదల చేస్తున్నారు. చిత్ర ప్రచారంలో భాగంగా బుధవారం సాయంత్రం ‘చెక్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. చేయని తప్పుకి దేశద్రోహం కేసులో నితిన్ అరెస్టయి సెంట్రల్ జైలుకి వెళ్తారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అక్కడ చెస్‌లో తనకున్న ప్రతిభను చూపిస్తాడు. అలాగే, రకుల్ ప్రీత్ సింగ్ సాయంతో కేసు నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తాడు. అంతేకాకుండా, జైల్లో నితిన్‌కు వ్యతిరేక వర్గం అతన్ని ప్రతి విషయంలోనూ అడ్డుకుంటుంది. ఇలా ప్రతికూల పరిస్థితుల్లో నితిన్ సాధించిన విజయమే ‘చెక్’. ‘యద్భావం తద్భవతి.. అణువు నుంచి అనంతం వరకు ఏదీ కర్మను తప్పించుకోలేదు’ అని మురళీ శర్మ వాయిస్‌తో మొదలైన ట్రైలర్ చివరి వరకు ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ ప్రతి చిన్న డైలాగ్ టచ్ అవుతోంది. జైల్లో మరో ఖైదీతో మొదలైన నితిన్ ‘చెక్’.. జాతీయ స్థాయికి వెళ్తుంది. ‘ఒక టెర్రరిస్ట్‌తో చెస్ ఆడిస్తారా’ అంటూ మరో చెస్ ప్లేయర్ అనడం నితిన్‌కు ఎదురయ్యే అడ్డంకులను సూచిస్తుంది. ఇక ఎప్పటిలానే నితిన్ స్టంట్స్ మరో స్థాయిలో ఉన్నాయి. అలాగే, ప్రియా ప్రకాష్ వారియర్‌తో రొమాంటిక్ యాంగిల్‌ను కూడా ట్రైలర్‌లో టచ్ చేశారు. మొత్తంగా ట్రైలర్ చూస్తుంటే సినిమా కచ్చితంగా బాగుంటుందనే అనిపిస్తోంది. ఈ సినిమాలో సిమ్రన్ చౌదరి, పోసాని కృష్ణమురళి, సాయిచంద్, మురళీ శర్మ, హర్ష వర్ధన్, సంపత్ రాజ్, రోహిత్ పాతక్, వీరేంద్ర చౌహన్, చైతన్య కృష్ణ, గురురాజ్ మానేపల్లి, రైనా రావు, కార్తీక్ రత్నం, ప్రవీణ్ యండమూరి, క్రిష్ణతేజ, అజీజ్ నాజర్, సీవీఎల్ నరసింహారావు, మేకా రామకృష్ణ ఇతర పాత్రలు పోషించారు. రాహుల్ శ్రీవాస్తవ్ సినిమాటోగ్రఫీ అందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3txV3Sa
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...