Wednesday, 3 February 2021

గోపీచంద్‌తో సినిమా.. కచ్చీఫ్ వేసేసిన మారుతి.. షూటింగ్‌కు వెళ్లకుండానే రిలీజ్ డేట్ ఫిక్స్

దర్శకత్వంలో మ్యాచో హీరో ఒక సినిమా చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ గోపీచంద్ 29వ సినిమాను యూవీ క్రియేషన్స్, జీఏ2 సంస్థలు నిర్మిస్తున్నాయి. మార్చిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే, ఇంకా టైటిల్ ఖరారు చేయకుండానే.. సినిమా సెట్స్‌పైకి వెళ్లకుండానే.. ఫస్ట్ లుక్ విడుదల చేయకుండానే విడుదల తేదీని ప్రకటించేశారు నిర్మాతలు. వరుస పెట్టి సినిమాలు థియేటర్లలోకి వస్తున్న తరుణంలో ముందు జాగ్రత్త చర్యగా ఇప్పుడే రిలీజ్ డేట్‌ను లాక్ చేసేశారట. ఈ ఏడాది అక్టోబర్ 1న గోపీచంద్-మారుతి సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. అంతేకాదు, ఆసక్తికర సందేశంతో ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో థియేటర్ సీట్‌లో అక్టోబర్ 1న విడుదల అని ఇంగ్లిష్‌లో రాసి.. కచ్చీఫ్ వేస్తున్నట్టు చూపించారు. ప్రస్తుతం ఈ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువీ, జీఏ2 వినూత్న ప్రయత్నానికి మంచి స్పందన వస్తోంది. ‘‘అందరికీ చాలా థాంక్సండీ..! రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఏదో కొత్తగా ట్రై చేద్దామని మేము చేసిన ప్రయత్నాన్ని యాక్సప్ట్ చేసి, మంచి బూస్టప్ ఇచ్చిన ఇండస్ట్రీ, మీడియా మరియు ప్రేక్షక దేవుళ్ళందరికీ చాలా థాంక్సండీ. మా ఈ చిత్రం అల్లు అరవింద్ సమర్పణలో హీరో గోపీచంద్ మరియు దర్శకుడు మారుతిల కాంబినేషన్‌లో త్వరలో షూటింగ్ మొదలుపెట్టి.. చెప్పిన టైమ్‌కి రిలీజ్ చేయగలమని హామీ ఇస్తున్నాం. ఇలాగే మేము చేసే ప్రతి ప్రయత్నం మీకు నచ్చి మీరు మెచ్చి మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. మీ.. యూవీ క్రియేషన్స్ మరియు జిఎ2 సంస్థలు ’’ అని తమ సందేశంలో పేర్కొన్నారు నిర్మాతలు. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36Dr29r
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...