Sunday, 7 February 2021

బికినీ వీడియో షేర్ చేసిన అప్సర రాణి.. ఆర్జీవీ ఊరకనే ఉంటాడ!

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎంత బోల్డ్‌గా ఉంటారో ఆయన హీరోయిన్లు కూడా అంతే బోల్డ్‌గా వ్యవహరిస్తుంటారు. అందాలు ఆరబోయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ పరిచయం చేసిన తారల్లో అప్సర రాణి, పూజ భలేకర్ ఉన్నారు. ‘థ్రిల్లర్’ సినిమాతో అప్సర రాణిని పరిచయం చేసిన వర్మ ఆమె హాట్‌నెస్‌ను ప్రేక్షకులకు చూపించారు. ఆన్‌లైన్ ద్వారా విడుదలైన ఈ ఒక్క సినిమాతో బాగా పాపులర్ అయిపోయింది. ‘క్రాక్’ సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది. మరోవైపు పూజ భలేకర్ ‘లడికి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే, అప్సర రాణి సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులకు నయనానందాన్ని కలిగిస్తోంది. తన హాట్ ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఈ క్రమంలో ఆదివారం ట్విట్టర్‌లో ఒక హాట్ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో నీలం రంగు బికినీ ధరించిన అప్సర.. స్విమ్మింగ్ పూల్‌లో నుంచి వయ్యారంగా నచుకుంటూ వస్తోంది. ‘ఐ యామ్ ఎ వాటర్ బేబీ’ అని క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ వీడియోకు రామ్ గోపాల్ వర్మ రిప్లై ఇచ్చారు. ‘‘వావ్ అప్సర రాణి. అందుకే నిన్ను నేను ఏంజెల్ (అప్సర), క్వీన్ (రాణి) అని పిలుస్తాను. కానీ, ఈ వీడియో ఎవరు తీశారు?’’ అని ఆమెను ప్రశ్నించారు. దీనికి స్పందించిన అప్సర రాణి.. ‘‘మన సూపర్ టాలెంటెడ్ ‘లడికి’ పూజ షూట్ చేసి, ఎడిట్ చేసిన వీడియో ఇది’’ అని పేర్కొంది. దీనికి మళ్లీ వర్మ రిప్లై ఇస్తూ.. ‘‘ఓహ్ వావ్. లడికి గర్ల్ కేవలం తన్నుతుందని మాత్రమే నేను భావించాను. ఆమె షూటింగ్ కూడా చేస్తుందని నాకు అస్సలు తెలీదు’’ అని వెల్లడించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aLtsUX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...