Sunday, 7 February 2021

హీరో సూర్యకు కరోనా పాజిటివ్.. ఇంకా సాధారణ పరిస్థితి రాలేదంటూ మెసేజ్

విలక్షణ నటుడు, తమిళ స్టార్ హీరో సూర్యకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఆదివారం రాత్రి ట్వీట్ చేసిన .. ‘‘నేను కరోనాతో బాధపడుతున్నాను. ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నాను. మన జీవితం ఇంకా సాధారణ పరిస్థితికి రాలేదన్న విషయాన్ని మనందరం గ్రహించాలి. భయంతో వణికిపోకూడదు. అలా అని భద్రత, జాగ్రత్తలు తీసుకోకుండా ఉండకూడదు. నాకు వైద్యం అందిస్తోన్న వైద్యులకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. సూర్య మెసేజ్‌తో ఆయన అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అలాగే, ఇండస్ట్రీ ప్రముఖులు కూడా సూర్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ సందేశాన్ని తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే, కిందటేడాది ‘సూరారై పోట్రు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ పేరుతో వచ్చింది. ఓటీటీ ద్వారా విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. సూర్య ప్రస్తుతం తన 40వ సినిమాతో బిజీగా ఉన్నారు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39UNvkC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...