Sunday, 7 February 2021

17 ఏళ్ల తరవాత మళ్లీ వస్తోన్న ‘మన్మథుడు’ హీరోయిన్.. ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ స్కెచ్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ‘అరవింద సమేత’ తరవాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉండబోతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ప్రకటన వచ్చిన దగ్గర నుంచి ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా మరో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. తన సినిమాల ద్వారా అలనాటి స్టార్ హీరోయిన్లను మళ్లీ కీలక పాత్రల్లో చూపించి హైలైట్ చేస్తున్న త్రివిక్రమ్.. ఇప్పుడు మరో హీరోయిన్‌ను తీసుకొస్తున్నారట. త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా ద్వారా అన్షు అంబాని 17 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించబోతున్నారని టాక్. 2002లో వచ్చిన ‘మన్మథుడు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అన్షు.. 2003లో విడుదలైన ‘రాఘవేంద్ర’లో ప్రభాస్ సరసన నటించారు. అదే ఏడాది ‘మిస్సమ్మ’లో చిన్న పాత్ర చేశారు. మళ్లీ ఆమె తెలుగు సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు 17 ఏళ్ల తరవాత మరోసారి అన్షును తెలుగు ప్రేక్షకులకు చూపించబోతున్నారట త్రివిక్రమ్. ‘మన్మథుడు’ సినిమాకు త్రివిక్రమ్ రచయిత. ఈ పరిచయంతో ఇటీవల అన్షును సంప్రదించారట త్రివిక్రమ్. పాత్ర నచ్చడంతో అన్షు కూడా చేయడానికి అంగీకరించారని అంటున్నారు. మరి, ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. మరోవైపు, అన్షు 2003లో లండన్‌కు చెందిన సచిన్ సాగర్‌ను పెళ్లాడారు. ఆమెకు ఇద్దరు పిల్లలు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2N23unR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...