Sunday, 14 February 2021

పక్కా కమర్షియల్: మారుతి- గోపీచంద్ కాంబో సెట్టయింది.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్

ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీమార్' మూవీ చేస్తున్న మ్యాచో హీరో మరో సినిమాను లైన్‌లో పెట్టేశారు. డైరెక్టర్ దర్శకత్వంలో ఆయన తదుపరి సినిమా రూపొందనుంది. తాజాగా ఈ రోజు (ఫిబ్రవరి 14) ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ చిత్ర టైటిల్ కూడా రివీల్ చేశారు. '' అనే ఆసక్తికర టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుందని తెలిపారు. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీవాసు నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. ఇలా ముచ్చ‌ట‌గా మూడోసారి జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్, బ‌న్నీవాసు, మారుతి కాంబినేష‌న్ సెట్ అయింది. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ ద్వారానే ద‌ర్శ‌కుడు మారుతి ''భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే'' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్స్ అందించారు. ఈ పక్కా కమర్షియల్ మూవీ షూటింగ్ మార్చి 5వ తేదీ నుండి జరగనుందని డైరెక్టర్ మారుతి ప్రకటించారు. గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా రాబోతున్న ఈ మూవీని అక్టోబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపి సినిమాపై ఆసక్తిరేకెత్తించారు. జేక్స్‌బిజోయ్ సంగీతం సమకూర్చుతుండగా.. ఎస్‌కేఎన్ సహనిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇక ఈ చిత్రంలో గోపీచంద్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవ‌ర‌నే విష‌యాన్ని త్వ‌ర‌లోనే వెల్లడిస్తామని అంటోంది చిత్రయూనిట్. మొత్తానికైతే మొదట్లోనే 'పక్కా కమర్షియల్' తనదైన శైలిలో అంచనాలు క్రియేట్ చేశారు డైరెక్టర్ మారుతి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qmTAMl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...