Sunday, 14 February 2021

అందుకోసమే వాలెంటైన్ డేను ఉపయోగించుకుంటాం.. ఉపాసన కామెంట్స్ వైరల్

లవర్స్ డే (ఫిబ్రవరి 14) వచ్చిందంటే ఇటు ప్రేమికులు, అటు భార్యాభర్తలు రకరకాల ప్లాన్స్ చేస్తుంటారు. కానుకలు, గత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ తమ తమ పార్ట్‌నర్‌తో హ్యాపీ మూడ్‌లో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే తమకు మాత్రం ప్రతీ చాలా చాలా ప్రత్యేకం అని చెబుతోంది కొణిదెల కోడలు . మీడియాతో కాసేపు ముచ్చటించిన ఆమె ప్రతి ఏడాది ప్రేమికుల రోజును తన భర్త రామ్ చరణ్‌తో చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటానని చెప్పింది. ప్రతి ఏడాది వాలైంటైన్ డే రోజున తామిద్దరం కూర్చొని జీవితంలోని చాలా విషయాలపై చర్చించుకుంటానమని, రోజంతా కలిసి సరదాగా టీవీ షోలు చూస్తూ, ఇష్టమైన పనులు చేస్తూ మాట్లాడుకొంటామని చెప్పింది. లైఫ్‌లో నిర్దేశించుకున్న లక్ష్యాలపై ఓ సారి రివ్యూ చేసుకుంటూ ఉంటామని తెలిపింది. ఆ సమీక్షల కోసమే ప్రత్యేకంగా వాలంటైన్ డేను ఉపయోగించుకొంటామని ఆమె చెప్పుకొచ్చింది. అటు చెర్రీకి, ఇటు తనకు జీవిత లక్ష్యాలను పున:సమీక్షించుకోవడానికి ఈ రోజును రోజును వేదికగా చేసుకొంటామని ఉపాసన పేర్కొంది. ఇకపోతే వాలంటైన్ డే రోజు చరణ్ తనకు ఎన్నో బహుమతులు ఇచ్చారని చెప్పిన ఉపాసన.. ఆ బహుమతుల కంటే మెమొరీస్‌పై రివ్యూ చేసుకోవడమే చాలా సంతోషాన్నిస్తుందని తెలిపింది. వాలెంటైన్స్ డే సందర్భంగా చరణ్ ఇచ్చిన గిప్టుల్లో బాగా గుర్తుండిపోయేది ఒకటి ఉందని, హృదయం ఆకారంలో ఉండే చెవి రింగులను ఆయన గిఫ్టుగా ఇచ్చారని చెప్పింది. దాంపత్య జీవితంలో అందరి మాదిరిగానే తమ మధ్య కూడా చిన్న చిన్న పోట్లాటలు జరగడం, ఆ తర్వాత కలిసిపోవడం జరుగుతుంటాయని ఉపాసన తెలిపింది. ఇక ఉపాసన, కెరీర్ విషయానికొస్తే.. మెగా కోడలిగా మెప్పు పొందుతూ పలు సామాజిక అంశాల పట్ల తన వంతు సహకారం అందిస్తోంది ఉపాసన. రామ్ చరణ్ ప్రస్తుతం తన RRR సినిమాతో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3b8utX4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...