కథల్లో నిజాయితీ, కథనంలో సహజత్వంతో సినిమాలు చేస్తూ హిట్స్ సొంతం చేసుకుంటున్న దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కొత్త సినిమా 'లవ్ స్టోరి'. ఈ సినిమాలో అక్కినేని హీరో , జంటగా నటిస్తున్నారు. టీజర్‌తో రేవంత్, మౌనికలుగా చైతూ, సాయి పల్లవిని పరిచయం చేసిన శేఖర్ కమ్ముల.. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వారి ప్రేమ కథ ఎలాంటిదో "నీ చిత్రం చూసి..'' పాటతో తెలియజేశారు. ఈ పాటకు మిట్టపల్లి సురేందర్ సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి పాడారు. పవన్ సీహెచ్ సంగీతాన్ని అందించారు. ఈ పాట లిరికల్ వీడియోను వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ రోజు (ఫిబ్రవరి 14) విడుదల చేశారు. ఈ వీడియోలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రేమ చిహ్నాలను పెయిటింగ్స్ రూపంలో చూపించారు. అలనాటి హైదరాబాద్ ప్రేమ చిహ్నలైన "పురాణపూల్,తారామతి బరాదారి, కోటి రెసిడెన్సీ, బ్రిటిష్ రెసిడెన్సీ" లను చూపించిన శేఖర్ కమ్ముల చివరగా రేవంత్ మౌనిక ప్రేమ వారధి అయిన 'రేవంత్ జుంబా సెంటర్'ను చూపించారు. వీటి ద్వారా వీళ్లిద్దరి ప్రేమ కథ కూడా చాలా గొప్పదని దర్శకులు శేఖర్ కమ్ముల చెప్పకనే చెప్పారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 'లవ్ స్టోరి' చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3deegCy
v
No comments:
Post a Comment