Friday, 5 February 2021

రాధేశ్యామ్ స్పెషల్ సర్‌ప్రైజ్.. సేవ్ ది డేట్, బిగ్ అనౌన్స్‌మెంట్ అంటూ రెబల్ స్టార్ ప్రకటన

రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా ఎన్ని ఎదురుచూస్తున్న ఆ క్షణం దగ్గరపడింది. ప్రేమికుల రోజు కానుకగా తాజా సినిమా 'రాధేశ్యామ్' నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్ రాబోతుందని పేర్కొంటూ బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు కొత్త పోస్టర్ షేర్ చేస్తూ ఫిబ్రవరి 14వ తేదీన గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రెబల్ స్టార్ అభిమానులతో పంచుకుంటూ 'సేవ్ ది డేట్, ఈ దశాబ్దానికి గాను అతిపెద్ద ప్రేమ ప్రకటన' అని పేర్కొంది చిత్రయూనిట్. ఈ మేరకు ‘రాధేశ్యామ్‌’ ప్రీ టీజర్‌ వదిలారు. 1960 దశకం నాటి వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ప్రభాస్ సరసన యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, ఎయిర్‌టెల్‌ భామ శాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ప్రభాస్ ప్యూర్ రొమాంటిక్ రోల్‌ పోషిస్తున్నారట. తాజాగా విడుదల చేసిన ప్రీ టీజర్‌లో ప్రభాస్‌ని ఓ ప్రేమికుడిగా యంగ్‌ లుక్‌లో చూపించి ఆయన అభిమానులను ఫిదా చేశారు. 30 సెకన్ల వీడియోనే అయినా విడుదలైన కాసేపట్లోనే ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రభాస్ 20వ సినిమాగా రాబోతున్న ఈ మూవీ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36N3D5E
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...