ఏ హీరోయిన్‌కైనా సరే.. తమ కెరీర్‌లో ఓ బిగ్ స్టార్ హీరోతో అవకాశం రావడమనేది ఓ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కొన్ని సందర్బాల్లో అప్పటిదాకా ఎవ్వరికీ తెలియని హీరోయిన్ కూడా స్టార్ హీరోతో నటించాక భారీ పాపులారిటీ కూడగట్టుకోవడం చూసాం. మరి పవన్ కళ్యాణ్ లాంటి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న హీరోతో రొమాన్స్ చేసే ఛాన్స్ వచ్చిందంటే ఆ హీరోయిన్ పొందే ఆనందం మాటల్లో చెప్పగలమా? ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఇస్మార్ట్ బ్యూటీ . రీ- ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిన పవన్ కళ్యాణ్ ఇటీవలే తన 'వకీల్ సాబ్' సినిమా షూటింగ్ ఫినిష్ చేసి ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు. అందులో ఒకటే క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా. పవర్‌ఫుల్ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. ఎ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలిసింది. కాకపోతే హీరోయిన్లు ఎవరనే దానిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై రియాక్ట్ అయిన నిధి అగర్వాల్.. అవును, నేను పవన్ కళ్యాణ్‌తో కలిసి నటిస్తున్నానని క్లారిటీ ఇచ్చేసింది. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో #PSPK27 గురించి స్పందిస్తూ మెగా అభిమానులను ఫిదా చేసే మాటలు మాట్లాడింది. ఇలాంటి పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌లో పవర్‌స్టార్‌తో తెరపంచుకోనుండటం ఎంతో ఆనందంగా ఉందని, తన కల నెరవేరినట్లుగా ఉందని తెలుపుతూ ఫీలింగ్స్ బయటపెట్టేసింది. నటిగా ఇది తనకు తొమ్మిదో చిత్రమని, దీన్ని గోల్డెన్ ఫిల్మ్‌గా భావిస్తున్నానని చెప్పింది. ఇకపోతే ఇప్పటికే తాను ఈ సినిమా షూట్‌లో జాయిన్ అయినట్లు పేర్కొన్న నిధి అగర్వాల్.. అద్భుతమైన, ఉన్నతమైన వ్యక్తి అంటూ ఆయనపై పొగడ్తల వర్షం గుప్పించింది. మొదట ఈ చిత్రానికి 'విరూపాక్ష' అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారని వార్తలు రాగా, తాజాగా ఆ టైటిల్ కాదని ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్ ఫైనల్ చేశారని తెలుస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YSaSEV
v
No comments:
Post a Comment