Friday, 5 February 2021

Naandhi Trailer: ఇక్క‌డి చ‌ట్టాలు చేత‌కానివాడిపై వాడటానికేరా.. ప‌వ‌ర్‌లో ఉన్నోన్ని ఏం పీక‌లేవు

హీరోగా రాబోతున్న కొత్త చిత్రం ‘నాంది’. ఎప్పుడూ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలతో అలరించే నరేష్.. ఈ సారి ఓ ఇంట్రెస్టింగ్ సీరియస్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 19న విడుదల చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతులమీదుగా '' ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశారు. ఒక నిమిషం 52 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్‌లో చూపించిన ప్రతి సన్నివేశం థ్రిల్ చేస్తోంది. ఈ సన్నివేశాలు చూస్తుంటే ఈ మూవీ కోసం అల్లరోడు ఎంత కష్టపడ్డాడో అర్థమవుతోంది. చేయ‌ని నేరానికి ఐదేళ్ల నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ అమాయ‌కుడి క‌థను ఎన్నో ట్విస్టులతో ఎంతో ఆసక్తికరంగా మలిచారని తెలుస్తోంది. రాజ‌గోపాల్ అనే ఓ వ్య‌క్తి హ‌త్య‌కు గురికావడం, సూర్యప్రకాష్ (అల్లరి నరేష్) దోషిగా శిక్షించబడటం, ఆ తర్వాత పరిణామాలు ఈ ట్రైలర్‌లో చూపించి సినిమాకు హైప్ తీసుకొచ్చారు. 'ఇక్క‌డి చ‌ట్టాలు చేత‌కానివాడిపై వాడటానికేరా.. ప‌వ‌ర్‌లో ఉన్నోన్ని ఏం పీక‌లేవు' అని ట్రైలర్‌లో వినిపించిన డైలాగ్ చూస్తుంటే ఈ 'నాంది' సినిమాలో న్యాయవ్యవస్థ లోని లోపాలు వెలికితీశారేమోనని అనిపిస్తోంది. ఇకపోతే చివరగా.. 'అంద‌రూ నా జీవితం ఇక్క‌డితో అయిపోయింది అనుకుంటున్నారు. కాదు.. ఇప్పుడే మొద‌లైంది' అని అల్లరి నరేష్ చెప్పే డైలాగ్ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంది. అల్లరి నరేష్ కెరీర్‌లో 57వ సినిమాగా రాబోతున్న ఈ 'నాంది' సినిమా ద్వారా విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్‌వి2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మించారు. ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, ప్రియ‌ద‌ర్శి, దేవీప్రసాద్‌, విన‌య్ వ‌ర్మ, సి.ఎల్‌.న‌ర‌సింహారావు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఓ సన్నివేశంలో అల్లరి నరేష్ న్యూడ్‌గా నటించడం విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cMsH0r
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...