Thursday, 18 February 2021

డి. రామానాయుడు వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.. మిస్ యూ అంటూ వెంకటేష్ పోస్ట్

నేడు (ఫిబ్రవరి 18) గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ సందర్భంగా ఆయన కుమారుడు నిర్మాత సహా పలువురు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి నిర్మాతగా అడుగుబెట్టి దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న అన్ని భాషలలో సినిమాలు నిర్మించి తెలుగు సినిమా స్థాయిని పెంచిన నిర్మాత మన రామానాయుడు. ఆయన వర్ధంతి సందర్భంగా ఫిల్మ్ నగర్‌లో రామానాయుడు విగ్రహానికి ఆయన కుమారుడు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సత్యనారాయణ, సంతోషం పత్రిక అధినేత నిర్మాత సురేష్ కొండేటి పూల మాలలు వేసి ఘనమైన నివాళి ఘటించారు. ఈ సందర్భంగా కాజా సత్య నారాయణ గారు మాట్లాడుతూ "ఈ రోజు ఫిల్మ్ నగర్ ఇలా ఉంది అంటే దానికి ముఖ్య కారణం రామానాయుడు గారే, అయన చేసిన సేవల వలన ఈరోజు మన ఫిల్మ్ నగర్‌లో ఇంతమందికి జీవనాధారం దొరికింది. అందుకే ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు ప్రతిరోజు స్మరించుకుంటున్నాం'' అన్నారు. ఇక తండ్రి రామానాయుడు చిత్రపటాన్ని షేర్ చేసిన విక్టరీ .. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఈ రోజును మరచిపోలేం. ఈ జ్ఞాపకాలను స్మరించుకుంటూనే ఉంటాము. లవ్ యూ అండ్ మిస్ యూ నాన్న'' అని పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3s0B4Kf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...