యంగ్ హీరో రూటు మార్చినట్లు ఆయన లేటెస్ట్ మూవీ 'పాగల్' టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. 'ఈ నగరానికి ఏమైంది' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్ సేన్.. 'ఫలక్ నామా దాస్' సినిమాతో మాస్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేశాడు. ఆ తర్వాత హీరో నాని నిర్మించిన 'హిట్' సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు 'పాగల్' అనే మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విశ్వక్ సేన్. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఒక నిమిషం 7 సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్‌లో విశ్వక్ సేన్ కాస్త కొత్తగా దర్శనమిచ్చాడు. 'రేయ్.. ఎవడ్రా.. నా లవర్‌ని ఏడిపించింది' అంటూ రూటు మార్చేసి లవర్ బాయ్‌గా తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. ప్రేమ కోసం పరితపించే యువకుడిగా ఆకట్టుకున్నాడు. స్టైలిష్ యాటిట్యూడ్‌తో విశ్వక్ కనబర్చిన హావభావాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. నరేష్ కుప్పిలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ 'పాగల్' సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ రాధన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేశారు. ఏప్రిల్ 30వ తేదీన ఈ సినిమాను భారీ రేంజ్‌లో ప్రేక్షకుల ముందుకు తేవాలని ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qwyrPL
v
No comments:
Post a Comment