Tuesday, 16 February 2021

ఇప్పుడు కాక ఇంకెప్పుడు: రిలేషన్ విత్ బెనిఫిట్స్.. యూత్‌కి పిచ్చెక్కించే రొమాంటిక్ సీన్స్

ఈ మధ్యకాలంలో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు భారీ ఆదరణ దక్కుతోంది. అది చిన్న సినిమానా లేక పెద్ద సినిమానా అనేది పక్కనబెట్టి చిత్రంలో కొత్తగా ఏం దొరుకుతుందని అన్వేషిస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే యూత్‌ని‌ టార్గెట్ చేస్తూ పలు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అడల్ట్ సీన్స్, యూత్‌కి కనెక్ట్ అయ్యే సన్నివేశాలతో సినిమాలు రూపొందిస్తున్నారు మేకర్స్. ఇదే బాటలో రాబోతున్న సినిమా ''. టైటిల్ చూస్తేనే డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతోంది కదూ..! టైటిల్‌కి తగ్గట్లే తాజాగా రిలీజ్ చేసిన టీజర్‌లో రొమాంటిక్ సీన్స్‌తో పిచ్చెక్కించారు. షార్ట్ టర్మ్ రిలేషన్స్, రిలేషన్ విత్ బెనిఫిట్స్ అంటూ తమ సినిమాలో నేటి ఆడియన్స్ కోరుకునేలా కొత్త కోణం ఉంటుందని చెప్పకనే చెప్పేశారు. 'నచ్చినంత వరకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయడమే' అని హీరోయిన్ చెప్పిన డైలాగ్ టీజర్‌లో హైలైట్ అవుతోంది. ఇక ఈ టీజర్ మొత్తంలో తనికెళ్ల భరణి క్యారెక్టర్ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది. చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు దూరంగా పెరిగిన అబ్బాయికి, అలాగే అబ్బాయిలకు దూరంగా పెరిగిన అమ్మాయికి మధ్య జరిగిన రొమాంటిక్ జర్నీనే ఈ సినిమా సబ్జెక్ట్ అని తెలుస్తోంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' సినిమాను శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా తెరకెక్కిస్తున్నారు. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తుండగా.. చింతా రాజశేఖర్ రెడ్డి సమర్పణలో చింతా గోపాలకృష్ణ (గోపి) నిర్మిస్తున్నాడు. చిత్రంలో , నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ హీరో హీరోయిన్లుగా నటించారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NtRBHJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...