Tuesday, 16 February 2021

అక్కినేని నాగార్జున కొత్త సినిమా షురూ.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్

కింగ్ నాగార్జున కొత్త సినిమా షురూ అయింది. PSV గరుడవేగ ఫేం దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్లపై నారాయణ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. నేడు (మంగళవారం) ఉదయం ఈ చిత్రాన్ని సికింద్రాబాద్‏లోని గణేష్ టెంపుల్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి క్లాప్ ఇచ్చి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నిన్ననే 'బ్రహ్మాస్త్ర' షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చిన తనకు.. గణపతి దేవాలయంలో ఈ సినిమా ప్రారంభించడం చాలా సంతోషంగా అనిపిస్తోందని నాగార్జున తెలిపారు. నాగార్జునను సరికొత్త యాంగిల్‏లో చూపించేందుకు దర్శకుడు ప్రవీణ్ సత్తారు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేయలేదు. హైదరాబాద్‏తోపాటు విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరిపి సూపర్బ్ అవుట్‌పుట్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నారట. అతిత్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dhUwhf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...