Tuesday, 16 February 2021

పెళ్లిరోజు భర్తకు లాస్య సర్‌ప్రైజ్.. కారు గిఫ్ట్‌గా ఇచ్చిన యాంకర్

బుల్లితెర ద్వారా పాపులర్ అయిన యాంకర్లలో లాస్య ఒకరు. యాంకర్ రవితో కలిసి ఆమె చేసిన షోలు అప్పట్లో చాలా పాపులర్ అయ్యాయి. 2017 ఫిబ్రవరిలో మంజునాథ్‌ను లాస్య పెళ్లిచేసుకున్న తరవాత ఆమె యాంకరింగ్‌కు గుడ్ బై చెప్పారు. కుటుంబ బాధ్యతలతో ఆమె మళ్లీ టీవీ వైపు చూడలేదు. అయితే, పెళ్లైన ఏడాది తర్వాత యూట్యూబ్‌లో సొంతంగా ‘లాస్య టాక్స్’ అని ఛానెల్‌ పెట్టారు. ఈ ఛానెల్ ద్వారా వీడియోలు చేసి మళ్లీ తన అభిమానులకు దగ్గరయ్యారు. ఈ ఇమేజ్ అంతా ఒక ఎత్తయితే లాస్య కిందటేడాది బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనడం ద్వారా వచ్చిన ఇమేజ్ మరో ఎత్తు. బిగ్ బాస్ ద్వారా లాస్య ఫాలోయింగ్ మరింత పెరిగింది. లాస్యకు సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను 1.1 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ షోలో అత్యధికంగా పారితోషికం తీసుకున్న వాళ్లలో లాస్య కూడా ఒకరని అప్పట్లో రూమర్లు వచ్చాయి. అదెంత వరకు నిజమో తెలీదు కానీ.. బిగ్ బాస్ ద్వారా తాను సంపాదించిన మొత్తంతో తన భర్తకు మంచి బహుమతి ఇచ్చారు లాస్య. ఫిబ్రవరి 15న లాస్య, మంజునాథ్ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా తన భర్తకు మహీంద్ర ఎక్స్‌యువి 500 కారును లాస్య బహుమతిగా ఇచ్చారు. అయితే, ఇది మంజునాథ్‌కు బిగ్ సర్‌ప్రైజ్. అసలు ఈ కారును బుక్ చేసినట్టు మంజునాథ్‌తో పాటు ఇంట్లో ఎవరికీ తెలీదట. పెళ్లిరోజున అంటే నిన్న మంజునాథ్‌ను నేరుగా మహీంద్ర షోరూంకు తీసుకెళ్లి లాస్య సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆ తరవాత కారులో జూబ్లీ హిల్స్‌లోని పెద్దమ్మ గుడికి వెళ్లి పూజ చేయించుకన్నారు. ఈ ఫొటోలను లాస్య ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. అలాగే, తన భర్తకు సర్‌ప్రైజ్ ఇచ్చిన వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. లాస్య కొన్న కారు విలువ సుమారు రూ.25 లక్షలు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3b3AhRG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...